IIT: భవిష్యత్‌లో సైన్స్‌ కేంద్రంగా ‘ఐఐటీ’

చిత్తూరు జిల్లా: భవిష్యత్‌లో తిరుపతి ఐఐటీ సైన్స్‌ అభివృద్ధి కేంద్రంగా మారబోతోందని జేఎన్‌యూ నూఢిల్లీ మాజీ వీసీ రూపమంజరి ఘోష్‌ తెలిపారు. బుధవారం మండలంలోని ఐఐటీ తిరుపతి, జంగాలపల్లె వద్ద ఐసర్‌ ప్రాంగణంలో జాతీయ సైన్స్‌ దినోత్సవం నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి వందలాది మంది హాజరయ్యారు. రసాయనిక, భౌతికశాస్త్ర ప్రయోగాలను ప్రదర్శించారు. రూపమంజరి ఘోష్‌ మాట్లాడుతూ విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతకం క్వాంటమ్‌ ఫిజిక్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శాసీ్త్రయ అన్వేషణలోని అద్భుతాలు, ఆకర్షణీయమైన కార్యకలాపాలపై చర్చించారు.

#Tags