SERP Employees: భారీగా వేతనాలు పెంచిన ప్రభుత్వం.. సెర్ప్‌ ఉద్యోగులకు సంబరం..

విజయనగరం అర్బన్‌: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా జీతాలు పెంచింది. సెర్ప్‌ పరిధిలో వైఎస్సార్‌ క్రాంతి పథంలో పనిచేసే ఈ ఉద్యోగులు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ల ఉన్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు.
ఇన్‌చార్జ్‌ మంత్రి బూడి ముత్యాలు నాయుడిని సత్కరిస్తున్న సెర్ప్‌ ఉద్యోగులు

అయితే పనికి తగిన జీతం రావడం లేదని వీరు కొన్నేళ్లుగా ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వీరి జీతాలు పెంచుతూ ఈ నెలలో జీవో 64ను విడుదల చేసింది. బేసిక్‌ జీతంపై ఏకంగా 23 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ జీతం ఆగస్టు ఒకటి నుంచి వర్తింప చేస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. దీంతో సెప్టెంబర్‌లో వచ్చే జీతం పెరుగుతుండడంతో ఉద్యోగులు హర్హం వ్యక్తం చేస్తున్నారు.

Also read: Grama-Ward Secretariat 2023: పలు సమస్యలపై వినతి పత్రం

జిల్లా డీఆర్‌డీఏ–వెలుగు క్రాంతిపథంలోని ఎస్‌హెచ్‌జీ గ్రూపుల అభివృద్ధిలో సెర్ప్‌ పరిధిలో పనిచేసే ఉద్యోగులు కీలకంగా ఉన్నారు. వారిలో డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ (డీపీఎం), అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ (ఏపీఎం), కమ్యూనిటీ కో ఆర్డినేటర్‌ (సీసీ)లు, అడ్మిన్‌ అసిస్టెంట్లు (ఏఏ) ఉన్నారు. వీరిలో చాలా మంది 2002 నుంచి పనిచేస్తున్నారు. ఎస్‌హెచ్‌జీల అభ్యున్నతికి వీరు కృషి చేస్తున్నారు. వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంతో పాటు వాయిదాలు కట్టించడం, సీ్త్రనిధి బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడం, ఆయా ఎస్‌హెచ్‌జీ గ్రూపులు చేసే వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు.

Also read: SERP: ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు

ప్రభుత్వ పథకాలైన జగనన్నతోడు, వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ, జగనన్న పాలవెల్లువ, ఉన్నతి వంటి పథకాలను మహిళల వద్దకు తీసుకు వెళ్లి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారు. వారి వ్యాపారాలకు మార్కెటింగ్‌ అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉండే విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీఓఏ యానిమేటర్ల)ను సమన్వయం చేసుకుని సంఘాల ఉన్నతికి కృషి చేస్తున్నారు. వీరు కొన్నేళ్లుగా తమ జీతాలు పెంచాలని కోరుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డి వీరి వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాలో ప్రాజెక్టు మేనేజర్‌ (డీఎంపీ)– 1కి, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్లు 11 మందికి, అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ (ఏపీఎం)లు 50 మందికి, క్లస్టర్‌ కో ఆర్డినేటర్లు (సీసీ) 103 మందికి, అడ్మిన్‌ అసిస్టెంట్లు (ఏఏ) 22 మందికి చొప్పున మొత్తం 187 మందికి జీతాలు పెరిగాయి.

Also read: Government ITI college: ప్రభుత్వ ఐటీఐలో నూతన కోర్సు

వీరిలో చాలా మంది 2000వ సంవత్సరం నుంచి స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి బ్యాంకుల నుంచి సీ్త్ర నిధి, ఉన్నత వివిధ రకాల జీవనోపాధులను పెంపొందిస్తూ ప్రస్తుతం ప్రభుత్వ పథకాలపై వైఎస్సార్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, జగనన్న తోడు, వైఎస్సార్‌ ఆసరా, సున్నావడ్డీ, ఉన్నతి వంటి పథకాలను మహిళల వద్దకు తీసుకు వెళ్లి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ మేనేజర్‌కు బేసిక్‌ జీతం మీద రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకూ పెరిగింది.

Also read: Education for All: CM Jagan's Address on Jagananna Vidya Deevena at Nagari #sakshieducation

ఉద్యోగుల ఆనందోత్సవాలు

వేతన పెంపును ప్రభుత్వం ప్రకటించిన తరువాత క్షేత్రస్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు సెర్ప్‌ ఉద్యోగులు ఆనంనదోత్సవాలు జరుపుకున్నారు. ఏళ్లతరబడి ఉద్యమాలు చేసినా ఏ ప్రభుత్వం స్పందించలేదు. పాదయాత్రలో హామీ ఇవ్వపోయినా సమస్య తెలుసుకుని వేతనాలను భారీగా పెంచినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ పలు ప్రదర్శనలు చేపట్టారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుని, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రసామి, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావును కలిసి జిల్లా సెర్ప్‌ ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.

Student Speaks Up!:Sharing insights into the Jagananna Videshi Vidya Deevena Scheme #sakshieducation

#Tags