పీటీఈల వేతనాలు పెంపు
Sakshi Education
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో పనిచే స్తున్న పీటీఈ (పార్ట్‌టైమ్ ఎంప్లాయీస్)ల వేతనా లు పెరిగాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం వేతనాన్ని స్థిరీకరించగా, తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సొసైటీ పరిధిలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉద్యోగుల వేతనాలను సైతం 30 శాతం పెంచుతూ సొసైటీ కార్యదర్శి డి.రోనాల్డ్‌రాస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన వేతనాన్ని జూలై నెల నుంచి అమలు చేయనున్నట్లు అందులో వెల్లడించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రీజనల్ కోఆర్డినేటర్లు, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
చదవండి:
Published date : 05 Aug 2022 01:19PM