Skip to main content

అంతర్జాతీయ స్కూల్‌ గేమ్స్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ 

పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ స్కూల్‌ గేమ్స్‌లో ఎస్సీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు.
Talents of Gurukul students in International School Games
అంతర్జాతీయ స్కూల్‌ గేమ్స్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ 

షేక్‌పేట్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థకు చెందిన రవికిరణ్‌ జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని సాధించగా... డిండి పాఠశాలకు చెందిన మాయావతి 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌ విజేతలిద్దరినీ ప్రత్యేకంగా అభినందించారు. పేద కుటుంబాల నుంచి వచి్చన విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎస్సీ గురుకుల సొసైటీ తీర్చిదిద్దుతోందని వారు ప్రశంసించారు. 

Sakshi Education Mobile App
Published date : 21 May 2022 02:34PM

Photo Stories