Exams In September 2024: సెప్టెంబర్‌లో జరగనున్న పరీక్షల లిస్ట్‌ ఇదే..

Exams In September 2024

సెప్టెంబర్‌ నెల మొదలైపోయింది. దేశ వ్యాప్తంగా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర నియామక సంస్థలు పలు ఉద్యోగ నోటిఫికషన్లను విడుదల చేశాయి. వీటితో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశాలకు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. పోటీ పరీక్షలు, అకడమిక్‌ పరీక్షలతో విద్యార్థులు, యువత పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. 

CBSE releases Sample Question Papers: త్వరలోనే ఫైనల్‌ ఎగ్జామ్స్‌.. శాంపుల్‌ ప్రశ్నపత్రాలు రిలీజ్‌ చేసిన సీబీఎస్‌ఈ

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వ‌హించే.. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2024 (యూజీసీ-నెట్‌) పరీక్ష పరీక్షలు సెప్టెంబర్‌ 4 వరకు జరగనున్నాయి. ఇక స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే CGL పరీక్షలు సెప్టెంబర్‌ 09 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఇవి పూర్తవగానే ఎస్‌ఎస్‌సీ MTS & Havaldar పరీక్షలు నెల చివర అంటే ఈనెల 30 నుంచి నవంబర్‌ 14 వరకు నిర్వహించనున్నారు. 

Mega Job Mela: 1000కి పైగా ఉద్యోగాలు.. మెగా జాబ్‌మేళా

UPSC – CSE పరీక్షలు ఈ నెల 20 నుంచి మొదలయ్యి 29వరకు కొనసాగనున్నాయి. ఇండియన్‌ నేవీ పరీక్షలు ఈనెల 10-14 వరకు జరగనున్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ పరీక్షలు ఈనెల 09తో పూర్తి కానున్నాయి. దీంతో పాటు సెప్టెంబర్‌ నెలలో జరగనున్న మొత్తం పరీక్షల షెడ్యూల్‌ను ఓసారి చూసేద్దాం.
 

#Tags