Professional First Aid Training : స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ముగిసిన ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ.. ఈ అంశాలపై ప్రత్యేకంగా..
శ్రీకాకుళం: రెడ్‌క్రాస్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఆదివారంతో ముగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 20 మంది విద్యార్థులకు డాక్టర్ శ్రీకాంత్, రెడ్‌క్రాస్ ప్రొగ్రాం మేనేజర్ గొలివి రమణ ప్రథమ చికిత్సపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా సీపీఆర్‌పై అవగాహన, విపత్తుల సమయాల్లో గాయాలకు కట్టు కట్టడం, పాముకాటు, తేలుకాటు, గుండెపోటు వచ్చిన వారికి ప్రథమ చికిత్స, కరెంటు షాక్ తలిగిన వారికి, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స మరిన్ని అంశాలపై శిక్షణ ఇచ్చారు.
సామాన్యులకు కూడా ప్రథమ చికిత్సపై అవగాహన ఉండి తీరాలని తద్వారా విపత్తుల సమయంలో ప్రథమ చికిత్స చేయవచ్చని రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు అన్నారు. శిక్షణానంతరం చైర్మన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ బి.మల్లేశ్వరరావు, ఏఓ నర్సింగరావు, మేనేజర్ గుణాకరరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.