Govt Employees : ఈ ఉద్యోగులకు ప్రభుత్వ హామీలు.. అమలు ఎప్పుడు..!
సాక్షి ఎడ్యుకేషన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు చేశారు. అన్నివర్గాలకు అలవిగాని హామీలు ఇచ్చినట్టుగానే ఉపాధ్యాయల, ఉద్యోగులకూ ఎన్నో హామీలిచ్చింది. కాని, ఇప్పటివరకు మాట కూడా తీసింది లేదు. ఉదాహరణకు చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తరువాత, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలు విడుదల చేస్తామని చెప్పారు ఆ పార్టీ నాయకులు, అయితే, వారు చెప్పినందుకు ఒక విడుత కరువు భత్యం అయితే విడుదల చేశారు. కాని, మిగతా నాలుగింటి సంగతి ఇక దేవుడే ఎరుగు.
Departmental Exams : నేటి నుంచి డిపార్టమెంటల్ పరీక్షలు.. కఠిన నిబంధలతో..
గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. దేశంలోనే మొదటిసారిగా పీఆర్సీ ఏర్పాటుతో పాటు 5 శాతం ఇంటరిమ్ రిలీఫ్ ప్రకటించింది. ఆవెంటనే అమలు కూడా చేసింది. 2023, జూలై 1 నుంచి కొత్త పీఆర్‌సీ అమలుకావాలి. కానీ, ఇప్పటికీ అతీగతీ లేదు. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పినా, అది ప్రతీసారి వాయిదా పడుతూన వస్తోంది కాని, అమలు కావడం లేదు. ఇక ఈ నాలుగు సంవత్సరాల్లో ఇది అమలు అవుతుందో, లేదో అనే విషయం కూడా ఉద్యోగులను ఆందోళన చెందే పరిస్థితిలో ఉంచుతోంది. పీఆర్సీ మాట దేవుడెరుగు, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఇచ్చినా చాలనే స్థితిలో ఉద్యోగులున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు పీఆర్సీ కమిషన్ సిఫారసులకు ఆమోదం తెలిపి 73 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడంతో వారి వేతనాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. దీంతో, వేతనాలు పెరగడం విషయంలో మాత్రం తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే తొలివరుసలో నిలిచారు.
TGPSC Group 2 Exam: గ్రూప్–2లో ఉమ్మడి జిల్లా ప్రస్తావన.. పేపర్ –4లోనూ..
ఏడాది గడిచినా..
2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ పింఛన్ స్కీంను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని, లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో రాష్ట్రాలకు కోత విధిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలు అమలుచేసే విధంగా ఒత్తిడి చేసింది. సీపీఎం పార్టీ అధికారంలో ఉన్న అప్పటి పశ్చిమబెంగాల్, త్రిపుర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా పాత పింఛన్ విధానాన్నే అమలుచేశాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఇటీవలి కాలంలో త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే తెలంగాణలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పింది. కాని, ఏడాది గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇతర రాష్ట్రాలలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాగానే, ఉద్యోగులను మోసం చేస్తూ కుంటి సాకులతో కేంద్రంపైకి నెడుతూ తప్పించుకుంది.
దొందూ దొందే..
జాతీయ పింఛన్ విధానంలో ఉద్యోగులు చెల్లించిన 10 శాతం తిరిగి రాష్ట్రాలకు జమచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కేంద్రం ఇచ్చేదే లేదని తేల్చిచెప్పేసింది. దీన్ని సాకుగా చూపించి అన్ని రాష్ట్రాలు సీపీఎస్‌ను కొనసాగిస్తున్నాయి. సీపీఎస్ అమలులో కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే అనే విధంగా వ్యవహరిస్తున్నాయి.
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడాన్ని ఉద్యోగులు గమనిస్తున్నారు. జీవో నంబర్ 317ను సమీక్షించి పరిష్కారిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది. 10 నెలల తర్వాత ఆ నివేదిక మేరకు జీవో 243, 244, 245 విడుదల చేసింది. ఉద్యోగులు స్థానికత విషయం ప్రస్తావన లేకుండా కేవలం స్పౌజ్, అనారోగ్య కారణాలతో బదిలీలకు అవకాశం కల్పించారు. ఈ జీవోల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితులను, ఉద్యోగ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమంటూ.. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో రాగానే ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ ఉపాధ్యాయ సంఘాల నాయకుడు తీవ్రంగా వ్యతిరేకించారు. 317 జీవోపై గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని భావించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది.
హైకోర్టు తీర్పును కూడా..
ఇదిలా ఉంటే, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి ఇంత కన్నా దారుణంగా ఉంది. 31/3/24 నుంచి 7,346 ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వీరికి ఏ ఒక్క బెనిఫిట్ ఇవ్వకుండా వేధిస్తూనే ఉన్నరని ఉద్యోగులు వారి ఆవేదనను చెబుతున్నారు. 24 శాతం వడ్డీతో ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా అమలు మాత్రం కావడం లేదు. ఎన్‌క్యాష్మెంట్, గ్రాట్యుటీ, జీపీఎఫ్‌ల ద్వారా వచ్చే మొత్తం ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు.
500 నుంచి 1000వరకు
దాదాపు రూ.3,500 కోట్ల మేర చెల్లించాల్సిన ప్రభుత్వం ఇంకా నోరు విప్పడం లేదు. కొత్త ఆరోగ్య కార్డులు ఇచ్చి ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు పరిష్కారిస్తామన్న కాంగ్రెస్ ఇప్పటివరకు ఈ విషయమై కనీసం సమీక్ష కూడా చేయలేదు. ఉద్యోగులు ప్రభుత్వానికి 500 నుంచి 1000 వరకు కాంట్రిబ్యూషన్ చెల్లిస్తామని చెప్పినా ఒక్కడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి వేస్తున్నది. ఏడాదిగా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుండటంతో ఉద్యోగుల పట్ల ప్రభుత్వ ప్రేమ ఉత్తదేనని తేలిపోతున్నది. రెగ్యులర్ ఉద్యోగులకు వేతనాలు మాత్రమే ఇస్తూ ఎలాంటి ఇతర భత్యాలు, సరెండర్ లీవ్, రవాణా ఛార్జీలు, దిన భత్యం లాంటివి కూడా ఇవ్వడం లేదు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ఈ హామీని కూడా..
పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పారిశుధ్య నిధులు విడుదల చేయకపోవడం వల్ల అప్పులు చేసి మరీ వారు పనులు చేయిస్తున్నారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఆశా వర్కర్లకు, ఇందిరాక్రాంతి పథకం, గ్రామీణ ఉపాధి హామీ, అంగన్వాడీ టీచర్లకు, ఇతర చిన్న తరగతి ఉద్యోగులకు తక్షణ వేతన హెచ్చింపు చేస్తామని చెప్పి కనీసం వేతనాలు కూడా రెగ్యులర్‌గా ఇవ్వకుండా ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది.
GSDP: ఏపీలో.. అదనంగా పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి.. ఆర్‌బీఐ నివేదికలో వెల్లడి
గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇచ్చిన ఉద్యోగ భద్రత కనీస వేతన హామీ మరిచి పోయింది. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి మోసం చేసింది. 1వ తేదీన వేతనం చెల్లిస్తున్నామని గొప్పగా ప్రకటిస్తున్నా కేవలం ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ ద్వారా వేతనాలు పొందే వారికే చెల్లిస్తూ, లక్షకు పైగా ఉన్న ఉద్యోగులకు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం కాలయాపన చేస్తున్నది.
మే నెల తరువాత
ఉద్యోగ సంఘాల నేతలను కలిసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని, ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఓపిక పట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్యర్థించారు. వచ్చే సంవత్సరం మే నెల తర్వాత ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీని వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులను కలిసి చర్చించాలని కోరారు.
No Salaries : ఈ ఉద్యోగులు జీతాలు లేకనే ఇలా చేస్తున్నారు... కానీ..?
ఉద్యోగులు అడుగుతున్న కోరికలు కొత్తగా వచ్చినవి కావని, మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలనే వాళ్లు గుర్తుచేస్తున్నారని, తిరిగి కమిటీల పేర కాలయాపన ఎందుకో అర్థం కావడం లేదు. గతంలో ఉద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న ఎమ్మెల్సీ కోదండరాంకు ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నో సార్లు సమస్యలు వివరించారన్నారు. అయినా, ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు. ఇప్పుడు కొత్తగా కేశవరావును నియమించి ఏడాది తర్వాత విషయం మొదటికి తెచ్చారు.
కమిటీల పేర కాలయాపన ఎందుకో అర్థం కావడం లేదు. గతంలో ఉద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న ఎమ్మెల్సీ కోదండరాంకు ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నో సార్లు సమస్యలు వివరించారు. అయినా ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు. ఇప్పుడు కొత్తగా కేశవరావును నియమించి ఏడాది తర్వాత విషయం మొదటికి తెచ్చారు.
Govt Employees : శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు.. ఇవే..