Schemes for Students: విద్యార్థుల చదువుకు ఏపీ పథకాల అండ..

పేద విద్యార్థులు వారి ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఏపీ ప్రభుత్వం విద్య కోసం చేపట్టిన పథకాలను అమలు చేసి ఉన్నత విద్యను అందుకునే వారికి సహకరిస్తుంది..

అనకాపల్లి: జగనన్న విద్య, వసతి దీవెన పథకాలు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసాగా నిలుస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చదువులకు ఆటంకం లేకుండా ఏటా క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తోంది. జిల్లాలో 40,283 వేల మంది విద్యార్థులకు నాల్గున్నరేళ్ల కాలంలో రూ.434.10 కోట్లు ఆర్థిక సాయం అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు అర్హతే కొలమానంగా ఉన్నత చదువులకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న 275 విద్యా సంస్థల్లో డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ వంటి కోర్సులు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చదువుకునే అవకాశం కల్పిస్తోంది.

Date Extension: ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు.. దరఖాస్తులకు తేదీ పెంపు..!

వసతి దీవెనతో ఆర్థిక దన్ను

పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఆర్థికంగా భరోసాగా నిలిచేలా వసతి దీవెన కూడా అందిస్తోంది. ఐటీఐ కోర్సు చేస్తున్న విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌, ఇతర డిప్లొమా కోర్సుల వారికి రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సుల చదివే విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున జగనన్న వసతి దీవెన పథకం కింద అందిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.

Admissions 2024:గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నాడు ఏ కోర్సుకైనా రూ.35 వేలు మాత్రమే..

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగించారు. అయితే, ఏ కోర్సు చదివినా, ఏడాదికి రూ.35 వేలు మాత్రమే ఇచ్చారు. అది కూడా సవ్యంగా ఇవ్వకపోగా, ఇచ్చే వాటిని కూడా కాలేజీలకు చెల్లించటంతో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యేవి. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించాల్సిన దుస్థితి నాడు ఉండేది.

TSPSC Group 4 District Wise Jobs Details 2024 : గ్రూప్‌-4 పోస్టులు జిల్లాలు, రిజర్వేషన్లు వారీగా కేటాయింపు వివరాలు ఇలా..

విదేశాల్లోనూ చదువులు ఫ్రీ

విదేశాల్లో చదువుకునే వారికి సైతం ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. జగనన్న విద్యాదీవెన పథకం కింద ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ 50 యూనివర్సిటీల్లో సీటు పొందే అర్హులైన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకై తే రూ.1.25 కోట్లు, ఇతరులకు రూ.కోటి వరకు మంజూరు చేస్తోంది. జిల్లాలో ఇంతవరకు ఐదుగురు విద్యార్థులు విదేశీ విద్యాదీవెన పథకం లబ్ధి పొందారు.

Prof. DP Agrawal, Ex Chairman of UPSC : యూపీఎస్సీ సివిల్స్‌లో ఈ మూడు ద‌శ‌ల‌ను దాటాలంటే.. ఏం చేయాలి..? ఏం చేయ‌కూడ‌దు..?

#Tags