Thalli Vandanam : బ‌డులు పునఃప్రారంభం.. మ‌రి తల్లి వంద‌నం!

బడులు తెరిచి నెలరోజులవుతున్నా తల్లికి వందనం సాయం విడుదల కోసం తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు..

భీమవరం: ‘పేదల విద్యను ప్రోత్సహించేందుకు తల్లికి వందనం పథకం కింద ప్రతి పాఠశాల విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 చొప్పున అందిస్తాం. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికి ఈ పథకాన్ని వర్తింపచేస్తాం’. ఎన్నికలు సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇది. బడులు తెరిచి నెలరోజులవుతున్నా తల్లికి వందనం సాయం విడుదల కోసం తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో పేద కుటుంబాలు తమ పిల్లలను చదివించాలంటే ఇబ్బంది పడేవారు. కొందరు చదువులు మధ్యలోనే మాన్పించేసి పిల్లలను పనులకు పంపేవారు.

Job Mela Tomorrow : రేపు జాబ్ మేళా.. వీరే అర్హులు..

పేదల విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారిని ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టి అమలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించే పేదవర్గానికి చెందిన తల్లుల ఖాతాలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తూ వచ్చారు. 2019 నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు నాలుగు విడతల్లో 1,48,342 మంది తల్లుల ఖాతాలకు రూ.887.9 కోట్లు జమ చేశారు. డ్రాపవుట్స్‌ సమస్యకు చెక్‌ పెట్టారు. ప్రతి తల్లి తన పిల్లల్ని బడికి పంపేలా ప్రోత్సహించారు. అమ్మఒడి సాయాన్ని ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల అవసరాల కోసం వినియోగించుకోగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌ అవసరాల కోసం వెచ్చించేవారు.

World Population Day 2024: జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ఎంతమంది ఉంటే అంతమందికి

ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఇంతవరకు నమోదైన అడ్మిషన్‌ వివరాల మేరకు జిల్లాలోని 1,340 ప్రభుత్వ పాఠశాలల్లో 98,899 మంది విద్యార్థులు ఉండగా, 470 ప్రైవేట్‌ పాఠశాలల్లో 1,12,263 మంది విద్యార్థులున్నారు. ఇంటర్‌ విద్యార్థులు 38,500 మంది ఉన్నారు. మొత్తం 2,49,662 మంది విద్యార్థులు ఉండగా వీరిలో పేద విద్యార్థులు 70 శాతం మంది వరకు ఉంటారని అంచనా. అడ్మిషన్ల నమోదు ప్రక్రియ పూర్తయితే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ వర్గాలంటున్నాయి. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికి ఈ పథకం కింద సాయం అందిస్తామని కూటమి ప్రకటించింది.

IIT Jodhpur Introduces BTech In Hindi: ఇకపై హిందీలోనూ ఇంజినీరింగ్‌.. వినూత్న ప్రయోగం చేస్తున్న ఐఐటీ జోధ్‌పూర్‌

ఈ మేరకు 1,74,763 మంది పిల్లలకు ఈ ఏడాది రూ.15,000 చొప్పున రూ.262 కోట్ల సాయం అందించాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఈ సాయం పెరుగుతుంది. ఇప్పటికే పాఠశాలలు తెరిచి నెలరోజులు కావస్తోంది. తల్లికి వందనం సాయం విడుదలపై ఇంకా స్పష్టత లేదు. విదివిధానాలు ఖరారైన దాఖలాలు లేవు. రెక్కలు ముక్కలు చేసుకుని ప్రైవేట్‌ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించే పేద వర్గాలకు ఈ సాయం ఎంతో ఆసరా. త్వరితగతిన తల్లికి వందనం సాయం విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Polytechnic Admissions : పాలిటెక్నిక్ ప్ర‌వేశానికి చివ‌రి ద‌శ నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌..

న్యూస్‌రీల్‌.. గత ప్రభుత్వంలో జిల్లాలో అందించిన అమ్మఒడి సాయం

సంవత్సరం లబ్ధిదారులు ప్రభుత్వ సాయం

2020 1,47,900 రూ. 221 కోట్లు

2021 1,51,401 రూ. 226.9 కోట్లు

2022 1,50,536 రూ. 224.6 కోట్లు

2023 1,43,534 రూ. 215.4 కోట్లు

Artificial Intelligence Impact: రానున్న రోజుల్లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. తాజా నివేదికలో షాకింగ్‌ విషయాలు

#Tags