Skip to main content

IIT Jodhpur Introduces BTech In Hindi: ఇకపై హిందీలోనూ ఇంజినీరింగ్‌.. వినూత్న ప్రయోగం చేస్తున్న ఐఐటీ జోధ్‌పూర్‌

IIT Jodhpur Introduces BTech In Hindi

దేశంలో నూతన ఆవిష్కరణల విషయంలో రాజస్థాన్ ఎప్పుడూ ముందుంటుంది. విద్య లేదా వైద్యం... ఏదైనా ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక నూతన ఆవిష్కరణలు చేస్తూనే ఉంటారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఐఐటీ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది.

Artificial Intelligence Impact: రానున్న రోజుల్లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. తాజా నివేదికలో షాకింగ్‌ విషయాలు

ఇకపై ఐఐటీ జోధ్‌పూర్‌లో చేరే విద్యార్థులు బీటెక్‌ కోర్సును హిందీ మీడియంలో చదువుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆధారంగా విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తారు. దేశంలో హిందీలో బీటెక్‌ చదువులను అందించే తొలి ఐఐటీగా జోధ్‌పూర్‌ ఐఐటీ నిలిచింది.

ఆంగ్లంలో పరిమిత ప్రావీణ్యం కలిగిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని జోధ్‌పూర్ ఐఐటీ ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. జాతీయ విద్యా విధానం 2020 కింద ఈ నూతన కోర్సును ప్రవేశపెడుతున్నారు. జోధ్‌పూర్‌ ఐఐటీలో ఇకపై హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో బిటెక్ చేయవచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని ఇతర ఐఐటీలలో కూడా దీనిని అమలు చేసే అవకాశాలున్నాయి.

Group 1 Free Coaching : గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా కోచింగ్‌తో పాటు స్టైఫండ్‌

దేశంలోని 50 శాతం మంది విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలుకంటుంటారు. అయితే ఆంగ్లంలో ఈ కోర్సులు ఉండటం వలన చాలామంది విద్యకు దూరమవుతున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకే జోధ్‌పూర్‌ ఐఐటీ ఇంజినీరింగ్‌ కోర్సులను హిందీ మాధ్యమంలో ప్రవేశపెడుతోంది. 

 

Published date : 10 Jul 2024 04:10PM

Photo Stories