Education News:గణితంపై ఆసక్తి పెంపొందించేలా.. గణిత ల్యాబ్స్
గణితంపై ఆసక్తి పెంపొందించేలా..
సాధారణంగా చాలామంది విద్యార్థులకు గణితం అంటేనే భయపడతారు. అయితే శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ అందజేస్తున్న పరికరాలతో బోధించడంతో ప్రతి విద్యార్థికి ఆసక్తి కలుగుతుంది. రెండ్రోజుల శిక్షణతో మాలో బోధనాసక్తి పెరిగింది. ఈ పరికరాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వరం అనే చెప్పాలి.
– కె.విష్ణువర్ధన్‌రెడ్డి, గణిత ఉపాధ్యాయుడు
ఇదీ చదవండి: మార్కుల పరుగుల వేటతో మానసిక ఆందోళన ...విద్యార్థుల కు ఒత్తిడే శత్రువై.. ఈ ఆత్మహత్య లు..
మున్ముందు అన్ని పాఠశాలల్లో..
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇప్పటికే 5 వేల మంది విద్యార్థినులకు సెల్ప్ డిఫెన్స్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాం. అలాగే ఈ ఏడాది రూ.10 లక్షలతో ప్రాజెక్ట్ రూపొందించి పది ఉన్నత పాఠశాలల్లో మ్యాథ్స్ ల్యాబ్ పరికరాలు అందిస్తున్నాం. వాటి వినియోగంపై నిపుణులతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాం. ఈ ఏడాది 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మాత్రమే పరికరాలు ఉపయోగపడతాయి. వచ్చే ఏడాది 9, 10 తరగతులకు సైతం అందిస్తాం. అలాగే వచ్చే ఏడాది రెండు మండలాల్లోని మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలు చేస్తాం.
– నళిని, సీఈఓ, శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్
శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు
జడ్చర్ల టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంపొందించేందుకు పోలేపల్లి ఫార్మసెజ్‌లోని థర్మకేబుల్ సంస్థకు చెందిన శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ జడ్చర్ల మండలంలో 8, రాజాపూర్ మండలంలో 2 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గణిత ల్యాబ్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఎంపిక చేసిన ఒక్కో పాఠశాలలో ల్యాబ్ ఏర్పాటుకుగాను మొదటి విడతగా రూ.50 వేల విలువైన పరికరాలు అందించింది. వాటిని ఎలా వినియోగించాలో ఆయా పాఠశాలల గణిత ఉపాధ్యాయులకు నిపుణులతో రెండ్రోజుల శిక్షణ ఇవ్వగా బుధవారం ముగిసింది. ఎంపికై న పాఠశాలల్లో జడ్చర్ల మండలంలోని జడ్చర్ల, కోడ్గల్, పెద్ద ఆదిరాల, నసురుల్లాబాద్, గొల్లపల్లి, బాదేపల్లి బాలికల, బాదేపల్లి ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, రాజాపూర్ మండలంలోని రాజాపూర్, తిర్మలాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
ఇదీ చదవండి: Sankranti Holidays 2025 News
6, 7, 8 తరగతుల విద్యార్థులకు..
ఎంపికై న పాఠశాలల్లోని 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ఈ ఏడాదే ల్యాబ్‌లు ఏర్పాటు చేసి పరికరాలు అందజేసింది. విద్యార్థులు స్వయంగా వాటిని వినియోగించడంతో వారిలో గణితంపై ఆసక్తి పెరగడంతో పాటు గుర్తుండిపోతాయి. ఈ ఏడాది ఆయా పాఠశాలల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రస్తుత పాఠశాల్లోని 9, 10 తరగతులకు సైతం ల్యాబ్ పరికరాలు ఇవ్వడంతో పాటు మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ..
జడ్చర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసిన 10 పాఠశాలల్లోని 22 ఉపాధ్యాయులకు మంగళ, బుధవారం శిక్షణ ఇచ్చారు. గణిత ల్యాబ్‌లోని పరికరాలను ఎలా వినియోగించాలి.. వాటి ఉపయోగాలను సుఆర్ట్ ప్రతినిధులు అవగాహన కల్పించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)