Degree Admissions 2024: డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

అనంతపురం ఎడ్యుకేషన్‌: నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఏసీఆర్‌ దివాకర్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీఏ, బీఎస్సీ, బీకాంలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ముందుగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

దీని కోసం బుధవారం నుంచి కళాశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10 లోపు కళాశాలలోని ఆయా విభాగాధిపతులను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలి. ఈనెల 11 నుంచి 15 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.

#Tags