Polytechnic College Admissions: ముగిసిన స‌ర్టిఫికెట్ ప‌రిశీల‌న‌.. నేటి నుంచి క‌ళాశాల ఎంపిక ప్ర‌క్రియ ఇలా..!

పాలిసెట్ ప‌రీక్ష‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల కౌన్సెలింగ్ ముగియ‌గా, క‌ళాశాల‌లో చేరేందుకు ఎంపిక ప్రక్రియ‌ను ప్రారంభించాల‌ని సూచించారు పాలిసెట్‌–2024 ఎన్టీఆర్‌ జిల్లా కో–ఆర్టినేటర్‌ డాక్టర్‌ ఎం.విజయసారథి..

మొగల్రాజపురం: పాలిసెట్‌–2024లో ర్యాంకులు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం సాయంత్రంతో ముగిసింది. నగరంలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో 697 మంది సర్టిఫికెట్లను గురువారం పరిశీలించామని పాలిసెట్‌–2024 ఎన్టీఆర్‌ జిల్లా కో–ఆర్టినేటర్‌ డాక్టర్‌ ఎం.విజయసారథి చెప్పారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోని కేంద్రంలో స్పెషల్‌ కేటగిరి విద్యార్థులైన పీహెచ్‌సీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, సీఏపీ విద్యార్థులకు చెందిన 116 మంది సర్టిఫికెట్లను పరిశీంచారు. మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 242 మంది, గుణదలలోని ఆంధ్రా లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 339 మంది జనరల్‌ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు.

Inter 2nd Round Admission List: ‘బీసీ గురుకుల కాలేజీ’ల్లో రెండోవిడత ప్రవేశాల జాబితా విడుదల

నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లు

శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని విజయసారథి తెలిపారు. విద్యార్థులు నమోదు చేసుకున్న వెబ్‌ ఆప్షన్లలో ఈ నెల 11వ తేదీన మార్పులు చేర్పులు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 13వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామని చెప్పారు. ఈ నెల 19వ తేదీలోగా కేటాయించిన కళాశాలకు విద్యార్థులు స్వయంగా వెళ్లి రిపోర్ట్‌ చేయాలని స్పష్టం చేశారు.

UPSC Civils Prelims 2024: ఈనెల 16న యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

#Tags