Children Sports : పిల్ల‌ల‌కు ఆట‌లతో ఆరోగ్యం.. మ‌నో వికాసం

సాక్షి ఎడ్యుకేష‌న్ : పిల్ల‌ల‌కు ఆట‌లు ఆరోగ్యంతో పాటు మ‌నో వికాసం ఇస్తాయి. పిల్ల‌లకు నిత్యం క‌నీసం ఒక అర‌గంట నుంచి గంట పాటైన ఆట‌లు ఆడించాలి. ప్రస్తుతం ప్ర‌తి స్కూల్స్‌లో కూడా స్పోర్ట్స్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి.

ఈ సంద‌ర్భంగా భాష్యం విద్యాసంస్థ‌లు మార్చి 17వ తేదీన జోన‌ల్ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వ‌హించారు. ఈ పోటీల్లో అత్తాపూర్ భాష్యం స్కూల్‌కు చెందిన 3,4,5వ త‌ర‌గ‌తుల విద్యార్థులు అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచి బహుమ‌తులు గెలుచుకున్నారు.

విజేత‌లు వీరే..
త్రో బాల్ లో 3వ త‌ర‌గ‌తి విద్యార్ధిని మొద‌టి బహుమ‌ని గెలుచుకుంది.'హ‌ర్డిల్ రిలే రేస్' లో 5వ త‌ర‌గ‌తి విద్యార్థులు ద్వితీయ బ‌హుమ‌తిని గెలుచుకున్నారు. అలాగే 'ర‌న్నింగ్ రేస్‌లో 3వ‌ త‌ర‌గ‌తి విద్యార్థిని ద్వితీయ బ‌హుమ‌తిని గెలుచుకుంది. భాష్యం స్కూల్స్‌ సీఈఓ చైత‌న్య‌, జేఈఓ  అంక‌మ్మ‌రావు విద్యార్థుల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. అలాగే ప్రిన్సిప‌ల్ అయ్యూబ్ బాషా, వైస్ ప్రిన్సిప‌ల్ లౌక్య విద్యార్థుల ప్ర‌తిభ‌ను ప్రసంసించారు.

#Tags