National Level Chess Competitions: చెస్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో పోటీలు

వ‌చ్చేనెల న‌వంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న చెస్ పోటీల గురించి కేఎస్ఎన్ మ‌హిళా డిగ్రీ క‌ళాశాల ప్రిన్సిపాల్ ప్ర‌క‌టించారు. పోటీల తేదీ త‌దిత‌ర వివ‌రాల‌ను ఆయ‌న బ్రోచ‌ర్ల ఆవిశ్క‌ర‌ణ కార్యక్ర‌మంలో వెల్ల‌డించారు..
National level Chess competitions held at women's college

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు నగరంలోని కేఎస్‌ఎన్‌ మహిళా డిగ్రీ కళాశాలలో నవంబర్‌ 26వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను కేఎస్‌ఎన్‌ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శంకరయ్య, డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పి.నరసింహారెడ్డి, ఫిజికల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసప్రసాద్‌, టోర్నమెంట్‌ డైరెక్టర్‌ ఏ. ఉదయ్‌కుమార్‌నాయుడు, టోర్నమెంట్‌ స్పాన్సర్‌ రవికుమార్‌ శుక్రవారం ఆవిష్కరించారు.

➤   survey statistics: గణాంకాలు చెప్పే నిజాలు పాలకులను రంజింపజేయలేవు

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి 210 మంది చెస్‌ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారన్నారు. 6 నుంచి 16 సంవత్సరాల వయస్సు వరకు అండర్‌–6, అండర్‌– 8, అండర్‌–10, అండర్‌–12, అండర్‌–14, అండర్‌–16 విభాగాల్లో బాల, బాలికలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు నవంబర్‌ 15వ తేదీలోపు www.apchess.org అనే వైబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

#Tags