Centre Of Excellence College Admissions 2024: ప్రభుత్వ కళాశాలకు భారీగా డిమాండ్‌.. అడ్మీషన్లు పూర్తయినా సీటు కోసం రికమెండేషన్స్‌

బెల్లంపల్లి: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏకైక బాలుర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ(సీఓఈ) బెల్లంపల్లి విద్యాలయంలో ప్రవేశానికి తీవ్ర పోటీ నెలకొంది. ఐదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి వందలాది మంది విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులతోపాటు రాయని వారూ 6, 7, 8, 9వ తరగతిల్లో ఏర్పడిన బ్యాక్‌లాగ్‌ సీట్ల కోసం రోజువారీగా పదుల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు సీఓఈ కళాశాల వద్ద బా రులు తీరుతున్నారు.

ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుండగా.. ఈ విద్యాలయం విద్యార్థులు చదువులో రాణిస్తున్న తీరుకు ఆకర్శితులై తమ పిల్లలకు సీటు కో సం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల వద్ద రెకమెండేషన్‌ పత్రాలు తీసుకొచ్చి ప్రవేశం కల్పించాలని ఒత్తిడి తెస్తుండడంతో ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఐదో తరగతిలో 80, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో మరో 80 సీట్లు భర్తీకి అవకాశం ఉండగా.. గత నెల రోజుల నుంచి వందలాది మంది విద్యార్థులు సీఓఈ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రవేశాల గడువు ముగిసినా ఏదో ఒక ఆశతో గురుకుల విద్యాలయానికి వచ్చేవారి సంఖ్య తగ్గడం లేదు.

Education Hub : ఎడ్యుకేషన్‌ హబ్‌ గా కాటారం.. ప్రత్యేకతలు ఇవే!

ఉత్తమ ఫలితాలతో ఆకర్షణ
పదో తరగతి, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వార్షిక ఫలితాల్లో సీఓఈ విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల విద్యార్థులతో పోటీ పడుతున్నారు. మెరుగైన ఫలితాలతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధి స్తున్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ విజ యాలు, ఏటా పలువురు విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐ టీ, మెడిసిన్‌ ఇతర విభాగాల్లో సీట్లు సాధిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

గత ఐదేళ్లుగా బెల్లంపల్లి సీఓఈ బాలుర గురుకుల విద్యాలయం పేరు మారుమోగుతోంది. దీంతో ప్రవేశ పరీక్షలో ప్రతీ సంవత్సరం వేల సంఖ్యలో విద్యార్థులు పోటీ పోటీ పడుతున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మాత్రమే సీట్లు లభిస్తుండడంతో మెజార్టీ విద్యార్థుల ఆశలు అడియాసలు అవుతున్నాయి. అయినా పట్టు వదలకుండా సీటు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Degree admissions 2024 : నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు


ఉన్నత విద్య వైపు..
కళాశాల నుంచి ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌ల విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసి బయటకు వెళ్లారు. ఒక్కో విద్యాసంవత్సరంలో 80మంది చొప్పున పరీక్ష రాయగా ఇందులో సుమారు 80శాతం మంది ఉన్నత విద్యావకాశాలు పొందారు. పదో తరగతి ఫ లితాల్లోనూ మెరుస్తున్నారు. ఏటా వంద శాతం ఉత్తీ ర్ణత సాధిస్తుండడంతో అందరి దృష్టి సహజంగానే సీఓఈ గురుకులం వైపు మళ్లుతోంది. 2018 నుంచి పదో తరగతి విద్యార్థుల బ్యాచ్‌ ప్రారంభమై ఇప్పటివరకు ఏడు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. 2014లో సంక్షేమ గురుకుల విద్యాలయం ప్రారంభమైంది.

ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువు
సీఓఈలో చదివిన విద్యార్థుల్లో 74 మంది దేశంలో ని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు ఎంబీబీఎస్‌–17 మంది, ఐఐ టీ–7, ఎన్‌ఐటీ–5, ట్రిపుల్‌–1, జీఎఫ్‌ఐటీ–5, ఏఐ ఎస్‌టీ–1, ఐజర–1, ఐకార్‌–5, ఎయిర్‌క్రాఫ్ట్‌–1, ఢి ల్లీ యూనివర్సిటీ–4, ఫోరెన్సీక్‌–4, యూనివర్సీటీ ఆఫ్‌ హైదరాబాద్‌–1, అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సి టీ–15 మంది చొప్పున అభ్యసిస్తున్నారు. జేఎన్‌టీయూలో మరో 24 మంది ఇంజినీరింగ్‌, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలతోపాటు ఫార్మసీ, అగ్రికల్చర్‌, వెటర్నరీ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు పదుల సంఖ్యలో అభ్యసిస్తున్నారు.

#Tags