20 lakh loan without any guarantee: ఏ హామీ లేకుండా రూ.20 లక్షల లోన్.. కేంద్రం స్కీమ్.. ఎలా అప్లై చేసుకోవాలంటే
మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? పెట్టుబడి కోసం బ్యాంకు లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని, పరిశ్రమను విస్తరించాలని నిధుల కోసం వెతుకుతున్నారా? అయితే ఇది మీకోసమే. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ ద్వారా రూ.20 లక్షల వరకు రుణాన్ని ఎలాంటి హామీ లేకుండానే పొందవచ్చు. ఈ రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యుద్ధ వాహనాల తయారీ సంస్థల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం: Click Here
సొంత వ్యాపారం కోసం పెట్టుబడి కావాలా?
సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారికి మొదటగా ఎదరయ్యే సమస్య పెట్టుబడి. పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయి. ఈ కారణంగానే చాలా మంది వ్యాపార ఆలోచనలను తుంచేసుకుంటారు.
ఎలాంటి హామీ లేకుండా రూ.20 లక్షలు
సూక్ష్మ, చిన్న పరిశ్రమ, వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్న వారికి ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. కొత్త వ్యాపారం, పరిశ్రమ స్థాపన లేదా ఇప్పటికే ఉన్న వ్యాపార విస్తరణకు ఎలాంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణం అందిస్తోంది.
కేంద్రం స్కీమ్‌కి ఇలా దరఖాస్తు చేసుకోండి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) ద్వారా ఈ రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద రుణం పొందడానికి మీకు కావలసిన వివరాలు, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం.
మీ వ్యాపార ఆలోచనలను నిజం చేసుకోవడానికి ఈ పథకం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
కేంద్రం ప్రకటించిన పథకం
సొంతంగా వ్యాపారం చేయాలని కలలుగంటున్న వారి కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతోంది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు, గ్యారెంటీ లేకుండా బ్యాంకుల నుంచి రూ.20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చని చెబుతోంది.
ముద్రా అంటే ఏమిటి?
ముద్రా అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. దేశంలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, వ్యాపారాల అభివృద్ధి కోసం స్థాపించిన ఆర్థిక సంస్థ. బ్యాంకులు, బ్యాంకింగేత ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమకూర్చటమే ముద్రా లక్ష్యం. 2015లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
లోన్ పరిమితి
గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్‌లో ఈ పరిమితిని పెంచారు.
రుణాల ప్రత్యేకతలు
ముద్రా రుణాలు పొందేందుకు ఎలాంటి పూచీకత్తు, గ్యారెంటీ అవసరం లేదు. తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. వ్యాపారాలు, పరిశ్రమల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా లోన్ తిరిగి చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్ దరఖాస్తు ముద్రా రుణాల కోసం ఉద్యమిమిత్ర www.udyamimitra.in వెబ్‌సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేయవచ్చు.
రిజిస్ట్రేషన్: దరఖాస్తుదారు పేరు, ఇ-మెయిల్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
వివరాల సమర్పణ: వ్యక్తిగత వివరాలు, వ్యాపార, పరిశ్రమ వివరాలు ఇవ్వాలి.
ప్రాజెక్ట్ ప్రతిపాదనలు: హ్యాండ్ హోల్డింగ్ ఏజెన్సీని ఎంచుకోవాలి లేదా నేరుగా లోన్ అప్లికేసన్ సెంటర్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేయవచ్చు.
లోన్ విభాగం: ముద్రా శిశు, ముద్రా కిషోర్, ముద్రా తరుణ్ విభాగంలో లోన్ ఎంచుకోవచ్చు.
సంబంధిత డాక్యుమెంట్లు: అందించిన వివరాలతో పాటు డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముద్రా రుణాలు సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి ఒక చక్కటి అవకాశంగా ఉంటుంది.