Skip to main content

Military Vehicle Manufacturing jobs: యుద్ధ వాహనాల తయారీ సంస్థల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

Military Vehicle Manufacturing jobs AVNL recruitment notification 2024  Junior Manager vacancy at AVNL  Apply for various posts at AVNL AVNL job openings 2024
Military Vehicle Manufacturing jobs

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగం లిమిటెడ్ (AVNL) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజర్, డిప్లమా టెక్నీషియన్, అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ అనే వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

Tally లో ఉచిత శిక్షణ జీతం 15వేలు: Click Here

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ Armoured Vehicle Nigam Limited (AVNL) నుండి విడుదల చేయబడింది.

భర్తీ చేస్తున్న పోస్టులు : AVNL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజర్, డిప్లమా టెక్నీషియన్, అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య : 81 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీల సంఖ్య క్రింది విధంగా ఉంది. 

జూనియర్ మేనేజర్ ఖాళీలు మొత్తం 24 పోస్టులు ఉన్నాయి. 

డిప్లమో టెక్నీషియన్ ఖాళీలు మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. 

అసిస్టెంట్ ఖాళీలు మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. 

జూనియర్ టెక్నీషియన్ ఖాళీలు మొత్తం 19 పోస్టులు ఉన్నాయి.

కనీస వయసు : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు.

గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయసు 28 సంవత్సరాలు.

వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

OBC అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

విద్యార్హత : 
జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధిత ఇంజనీరింగ్ లేదా మేనేజ్మెంట్ ఫీల్డ్ లో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 

డిప్లమో టెక్నీషియన్ ఉద్యోగాలకు డిప్లమోను సంబంధిత టెక్నికల్ విభాగాలలో పూర్తి చేసిన వారు అర్హులు.
జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధిత ట్రైడ్ లో NAC లేదా NTC సర్టిఫికెట్ ఉండాలి.

అప్లికేషన్ ఫీజు : 300/-
SC, ST, PwBD, ఎక్స్ సర్వీస్మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

జీతం : 
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 47,610/- రూపాయలు జీతం ఇస్తారు.
డిప్లమో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వరకు నెలకు 37,201/- రూపాయలు జీతం ఇస్తారు. 
అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వరకు నెలకు 37,201/- రూపాయలు జీతం ఇస్తారు. 
జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వరకు నెలకు 34,227/- రూపాయలు జీతం ఇస్తారు. 

అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి. 

ముందుగా అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలన్నీ స్పష్టంగా నింపిన తర్వాత అప్లికేషన్ లో తమ ఫోటో అంటించాలి. 
అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు పైన సెల్ఫ్ అట్టెస్టేషన్ చేసి అప్లికేషన్ కి జతపరిచి ఒక కవర్లో పెట్టి పోస్ట్ ద్వారా పంపించాలి.

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఏంపిక చేస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుండి 21 రోజుల్లోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ ను స్పీడ్ పోస్ట్ ద్వారా చేరే విధంగా పంపించాలి. 

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా: (Armoured Vehicles Nigam Limited, Machine Tool Prototype Factory, Ordnance Estate, Ambarnath, Dist. Thane, Maharashtra Pin 421 502

Published date : 03 Oct 2024 10:27AM

Photo Stories