School Facilities : పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు మౌలిక వ‌స‌తులు త‌ప్ప‌నిస‌రి..

మార్కాపురం టౌన్‌: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని డీఈఓ డి.సుభద్ర పేర్కొన్నారు. శుక్రవారం మార్కాపురం డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హెచ్‌ఎంలు ప్రణాళిక ప్రకారం విద్యార్థుల సమగ్ర వికాసానికి, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

Seat in IIT Kharagpur : ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యార్థికి ఖరగ్‌పూర్‌ ఐఐటీలో సీటు

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పాఠశాల నిర్వాహణ, రికార్డుల తయారీలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల గుణాత్మక మార్పునకు పాఠశాలలు వేదిక కావాలన్నారు. కార్యక్రమంలో డీవైఈఓ చంద్రమౌలీశ్వర్‌, డీసీఈపీ సెక్రటరీ వెంకటరావు, హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డితోపాటు అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌, సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Govt Hostels Admissions : ప్రభుత్వ శారీరక వికలాంగులకు వసతి గృహంలో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు..

#Tags