Average Student Time Management Strategy For Sucess- పోటీ పరీక్షల్లో ఇలా చేస్తే విజయం మీదే

యూపీఎస్సీ, ఐఈఎస్‌, గేట్‌ సహా ప్రధాన పోటీ పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇప్పటికే అభ్యర్థులు పస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అందరికీ 24 గంటల సమయమే ఉంటుంది. కానీ కొందరు మాత్రమే సరిగ్గా ప్లాన్‌ చేసుకొని సిలబస్‌ను పూర్తిచేసి విజయం సాధిస్తుంటారు.

అందుకే టైం మేనేజ్‌మెంట్‌ అన్నది చాలా ముఖ్యం. సరిగ్గా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఒక యావరేజ్‌ స్టూడెంట్‌ కూడా పరీక్షలో టాప్‌ స్కోర్‌ చేసి విజయం సాధించవచ్చంటున్నారు  IIM అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి,అనిష్ పాసి

పక్కా షెడ్యూలింగ్‌ ముఖ్యం
ఒక యావరేజ్‌ స్టూడెంట్‌ని కూడా టాపర్‌గా మర్చే స్ట్రాటజీ టైమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఉంటుంది. అందుకే సరైన ప్రణాళిక, స్మార్ట్‌ వర్క్‌ ఉంటే ఎలాంటి పోటీ పరక్షల్లో అయినా విజయం సాధించవచ్చు. పూర్తి సిలబస్‌ చదవడానికి సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. పక్కా షెడ్యూలింగ్‌తో ముందుకు వెళ్తే మంచి స్కోర్‌ సాధించే అవకాశం ఉంది.

ఇండియన్‌ నేవీలో 10+2(బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌.. ఎవరు అర్హులంటే..

ప్రిపరేషన్‌కి ఎంత సమయం?
ఏ పోటీ పరీక్షకి సిద్ధపడాలో నిర్ణయించుకుని ఆపై సిలబస్‌, ప్రశ్నపత్రాల పరిశీలన, తగిన పుస్తకాల ఎంపిక జరిగాక ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామన్నది ముందు నుంచే ప్రణాళి వేసుకోవాలి. దానికి తగ్గట్లు ఫాలో అయితే విజయం మీ సొంతం అవుతుంది. ప్రిపరేషన్‌కి ఎంత సమయం పడుతుందనేది అభ్యర్థి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మొదలైన లక్షణాలపై ఆధారపడి ఉంటుంది.

పోటీ పరీక్ష స్థాయి, పోటీ పడే అభ్యర్థుల సంఖ్య, లభ్యమయ్యే పోస్టుల సంఖ్య మొదలైన అంశాల మీద ఆధారపడి ప్రిపరేషన్‌ సమయాన్ని నిర్థారించుకోవాలి. సమయాన్ని ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చో తెలిస్తే ఒక యావరేజ్‌ స్టూడెంట్‌ కూడా టాపర్‌గా మారొచ్చు. దీనికోసం ముందుగా ఒక పక్కా టైమ్‌ టేబుల్‌ను సిద్దం చేసుకోండి.

వాటిపైనే ఎక్కువ ఫోకస్‌

మీకు గతంలో కష్టంగా అనిపించిన సబ్జెక్ట్స్‌పై మరింత ఫోకస్‌ పోయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నప్పుడు స్మార్ట్‌వర్క్‌ చాలా ముఖ్యం. ఏ సబ్జెక్ట్‌కి ఎంత సమయం అవసరం? దేన్నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి వంటి విషయాలపై పూర్తి అవగాహన ఉండాలి. ఇలా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళితే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. 

పోటీ పరీక్షల్లో ఇదే ముఖ్యం
ముందుగా మీకు తెలియని అంశాలపై ఎక్కువగా అధ్యయనం చేయండి. మీకు రాని సబ్జెక్ట్స్‌పై పట్టు సాధిస్తే మీలో కాన్ఫిడెన్స్‌ మరింత పెరుగుతుంది. ఇది మీ బాడీ లాంగ్వేజ్‌లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని అనుకున్న టాస్క్‌ పూర్తి చేయగలిగితే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.

సాధారణంగా పోటీ పరీక్షల్లో సమాధానాలు కాస్త కన్ఫ్యూజన్‌ రేకెత్తిస్తాయి. అలాంటి టైంలో కంగారు పడకుండా విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని పరిష్కరిస్తే ఎలాంటి పరీక్షలనైనా క్లియర్‌ చేయొచ్చు. సమయాన్ని తెలివిగా వాడుకోవడం, తెలివిగా వ్యవహరించడమే పోటీ పరీక్షల్లో కీలక పాత్ర పోషిస్తాయి. 

#Tags