Gurukul Admissions : గురుకుల పాఠ‌శాల‌ల్లో ఆరు నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

గోకవరం: వీరలంకపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కేఎంవీ రాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశానికి ఎస్సీలకు 3, బీసీ–సికి 10, బీసీకి ఒకటి కలిపి మొత్తం 14 సీట్లు ఉన్నాయన్నారు. ఏడో తరగతిలో ఎస్సీ 7, బీసీ–సి 10, బీసీ ఒకటి కలిపి 18 సీట్లు ఉన్నాయని వివరించారు.

Campus Recruitment Drive: ఐటీఐ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 28న క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌

ఎనిమిదో తరగతిలో బీసీ–సి 5, ఎస్టీ 3, బీసీ ఒకటి, ఓసీ ఒకటి కలిపి 8 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ 8, బీసీ–సి 10, బీసీ 3 కలిపి మొత్తం 21 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు మంగళవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. వివరాలకు 94411 02187 నంబర్‌లో సంప్రదించాలని రాణి సూచించారు.

TS Gurukula Jobs Appointment Date 2024 : శుభ‌వార్త‌.. వివిధ గురుకుల‌ల్లో పోస్టుల భ‌ర్తీ జూలైలోనే.. ఇంకా.

#Tags