Hotel Management Courses: హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. అర్హులు వీరే..!

బుధవారం నిర్వ‌హించిన‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ ఆర్‌.రమణప్రసాద్‌. ఈ కోర్సుల్లో ప్ర‌వేశం పొందేందుకు ప్ర‌క‌టించిన తేదీలోగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని సూచించారు..

తిరుపతి: స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లయిడ్‌ న్యూట్రీషియన్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ ఆర్‌.రమణప్రసాద్‌ తెలిపారు. ఆయన బుధవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. తమ ఇనిస్టిట్యూట్‌లో బీఎస్‌సీ, క్రాప్ట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌, పెటిసరీ, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సరీవస్‌ వంటి కోర్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Anganwadi Schools: ప్రీస్కూల్స్‌గా అంగన్‌వాడీలు!

మూడేళ్ల బీఎస్‌సీ హెచ్‌ అండ్‌ హెచ్‌ఏ కోర్సుకు ఇంటర్‌లో 50 శాతం మార్కులు, ఆ పైన సాధించిన వారు, క్రాప్ట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌ అండ్‌ పెటిసరి కోర్సు, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీస్‌ ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు జూన్‌ 21వ తేదీలోపు దరఖాస్తులను కళాశాలకు పంపాలని సూచించారు. వివరాలకు 9701343846, 9100558006 లో సంప్రదించాలన్నారు. కళాశాల అడ్మిషన్‌ ఇన్‌చార్జ్‌ కె.శివరామకృష్ణ, అడ్మిషన్‌ ఆఫీసర్‌ ఎస్‌.భార్గవి, ఫుడ్‌ ప్రొడక్షన్‌ ఫ్యాకల్టీ ఎన్‌.శివరామకృష్ణ చౌదరి, ఫ్రంట్‌ ఆఫీస్‌ ప్యాకల్టీ వై.సునీత పాల్గొన్నారు.

Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గేయం.. 13.30 నిమిషాలు.. 12 చరణాలు

#Tags