Andhra University: బెస్ట్‌ వేల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో ఏయూకు స్థానం

ఏయూక్యాంపస్‌ : బెస్ట్‌ వేల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ ఇన్‌ ఏసియాలో ఏయూకు మెరుగైన స్థానం లభించింది. ఆసియాలోని 20 దేశాల్లో 3,349 ఉన్నత విద్య అందించే విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేసి ఈ స్థానాలను ప్రకటించారు.

ఏయూ అత్యుత్తమమైన వర్సిటీల్లో టాప్‌ 300లో నిలిచింది. అకడమిక్‌ క్వాలిటీ, విద్య సంబంధిత అంశాలను పరిశీలించి ఈ ర్యాంకింగ్‌ అందించినట్లు నిర్వాహకులు ప్రకటించారు.

AP ECET & ICET Results 2024: రేపు ఉదయం 11 గంటలకు ఈసెట్‌, ఐసెట్‌ ఫలితాలు విడుదల

దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య ఇ.ఎన్‌.ధనుంజయరావు, ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌కు అందజేశారు.

#Tags