Navodaya Vidyalaya : న‌వోదయ విద్యాల‌య‌లో చేరితే బంగారు భ‌విష్య‌త్తు.. ప్ర‌వేశానికి మాత్రం!

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఆంగ్ల మాధ్యమ విద్యనందిస్తున్న ప్రభుత్వ రంగ విద్యాసంస్థ జవహర్‌ నవోదయ విద్యాలయం.

కొమ్మాది (విశాఖ): కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఆంగ్ల మాధ్యమ విద్యనందిస్తున్న ప్రభుత్వ రంగ విద్యాసంస్థ జవహర్‌ నవోదయ విద్యాలయం. ఇక్కడ చదువుతోపాటు ఐఐటీ ప్రవేశ పరీక్షకు శిక్షణ, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు తదితర అంశాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఈ విద్యాలయంలో చదివే ప్రతి ఒక్కరికీ బంగారు భవిష్యత్‌ ఉంటుందని తల్లిదండ్రుల నమ్మకం. దీంతో ఈ విద్యాలయంలో ప్రవేశం పొందేందుకు తీవ్ర పోటీ నెలకొంది. పక్కా ప్రణాళిక, కఠోరమైన సాధన చేస్తే తప్ప ఈ విద్యాలయంలో 6వ తరగతిలో సీటు సాధించలేం. ఇక్కడ విద్యాభ్యాసం ఎలా ఉంటుంది, దైనందిక కార్యక్రమాలు, వసతి, భోజన సౌకర్యాలు తదితర అంశాలపై ఓ లుక్‌ వేద్దాం.

Spot Admissions: ఈనెల 31న పాలిటెక్నిక్‌ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు

కొమ్మాది నవోదయ విద్యాలయం.. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో విద్యనందిస్తున్న సంస్థ. ఈ పాఠశాలలో చేరేందుకు ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో మూడు, నాలుగో తరగతి చదివి.. ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 80 సీట్లలో రూరల్‌ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం కేటాయిస్తారు. ఈ స్కూలులో చేరేందుకు 100 మార్కులతో కూడిన ప్రవేశ పరీక్ష ఉంటుంది. మేధాశక్తి పరీక్షకు 50 మార్కులు, గణిత పరీక్షకు 25 మార్కులు, భాషా పరీక్షకు 25 మార్కులు ఉంటాయి.

అందుబాటులో అన్ని సౌకర్యాలు

విద్యార్థులు తమ అవసరాల కోసం బయటకు వెళ్లనవసరం లేదు. అన్నీ విద్యాలయంలోనే అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు అనారోగ్యానికి గురైనా ప్రాంగణంలోనే ప్రత్యేక మెడికల్‌ రూమ్‌లో స్టాఫ్‌ నర్స్‌ ద్వారా ప్రాథమిక చికిత్సను అందిస్తారు. మరింత మెరుగైన చికిత్స అవసరమైతే నగరంలోని ఆస్పత్రుల్లో వైద్యసేవలందిస్తారు. విద్యార్థులకు దుస్తులు, షూ, రెండు జతల స్పోర్ట్స్‌ దుస్తులు, బెడ్‌ షీట్‌, టవల్‌, పుస్తక సామగ్రితో పాటు విద్యార్థికి కావాల్సిన అన్ని వసతులు ఉచితమే.

BRICS Youth Summit: వారెవ్వా.. బ్రిక్స్‌ యూత్ సదస్సులో పాల్గొన్న ఏౖకైక తెలుగమ్మాయి ఈమెనే..

అత్యుత్తమ విద్యాబోధన

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతిభావంతులైన విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. సాంకేతిక విద్యను అందిస్తారు. శాంసంగ్‌ సౌజన్యంతో 41 ల్యాప్‌టాప్‌లు ఏర్పాటు చేసి.. ప్లాస్మా టీవీ, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యంతో డిజిటల్‌ విధానంలో బోధిస్తున్నారు. ఉత్తమ సంస్కృతి విలువలను పెంపొందించడం, పర్యావరణంపై అవగాహన, క్రీడలు, వ్యాయామ విద్యలో శిక్షణ, హిందీ, ఆంగ్లం, తెలుగు భాషల్లో తగిన నైపుణ్యాలను పెంపొందించడం, వలస విద్య (మైగ్రేషన్‌) విధానం ద్వారా హిందీ రాష్ట్ర విద్యార్థులను హిందీయేతర రాష్ట్రాలకు పంపించి జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించడం, వ్యాసరచన, వ్యక్తృత్వ, క్విజ్‌, గీతాలాపన, చిత్రలేఖనం, సాంఘిక నాటకాల ప్రదర్శన తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ, వివిధ క్రీడల్లో పోటీల నిర్వహణ, వారంలో ఓ రోజు విద్యార్థులకు ఇంటర్‌ హౌస్‌ పోటీల నిర్వహణ , బాలికల స్వీయరక్షణకు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ, శాసీ్త్రయ, జానపద నృత్యాలపై అభిలాష ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. 10 వేల పుస్తకాలతో ఏర్పాటు చేసిన అధునాతన గ్రంథాలయం అందుబాటులో ఉంది.

PUC Admissions Counselling : పీయూసీ మొద‌టి ఏడాదిలో ప్ర‌వేశానికి కౌన్సెలింగ్.. ఈ విధంగా..!

వసతి సౌకర్యం ఇలా..

తరగతి గదిలో బాలురు, బాలికలు కలసి చదువుకుంటారు. వసతి, భోజనశాలలు వేర్వేరుగా ఉంటాయి. ఉపాధ్యాయులే అదనపు బాధ్యత తీసుకుని వార్డెన్‌గా వ్యవహరిస్తారు. 16 మంది ఉపాధ్యాయ బృందంలో రోజుకు 8 మంది చొప్పున పనిచేస్తూ వారి యోగక్షేమాలు పర్యవేక్షిస్తారు.

జనవరిలో ప్రవేశ పరీక్ష

జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2025–26లో 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు 2013 మే1 నుంచి 2015 జూలై 31 మధ్య జన్మించిన వారై ఉండాలి. https://navodaya.gov.in/nvs/en/Home1 వెబ్‌సైట్‌ను సందర్శించి.. ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 2025 జనవరి 18వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.

Reserve Bank of India Jobs: రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

#Tags