KGBV Admissions 2024: కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పాడేరు రూరల్‌(హుకుంపేట): పాడేరు మండలం లగిసపల్లి కేజీబీవీలో 2024–2025 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎన్‌.చంద్రకళ మంగళవారం ఓ ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6వ తరగతిలో 40 సీట్లు, 7వ తరగతిలో ఐదు, 8వ తరగతిలో నాలుగు, 9వ తరగతిలో రెండు, ఇంటర్మీడియెట్‌లో 40 సీట్లు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఏప్రిల్‌ 11వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

#Tags