Actor Vijay Felicitates Toppers From Board Examination: విద్యార్థులను ఘనంగా సన్మానించిన విజయ్.. టాపర్‌కు డైమండ్‌ రింగ్‌ గిఫ్ట్‌

కోలీవుడ్‌ టాప్‌ హీరో  దళపతి విజయ్ సాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. తాజాగా మరోసారి మంచి మనసు చాటుకున్నారు విజయ్‌. ఇటీవల వెలువడిన టెన్త్‌, ఇంటర్‌ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారిని అభినందించి వారికి బహుమతులు కూడా అందించారు. గతేడాది తమిళనాడు టాపర్‌కు డైమండ్‌ నెక్లస్‌ ఇచ్చిన విజయ్‌.. ఈ ఏడాదిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి డైమండ్‌ రింగ్‌ కానుకగా ఇచ్చారు.

హీరో నుంచి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత తొలిసారి తన పార్టీ  'తమిళగ వెట్రి కళగం' పేరుతో విధ్యార్థులను అభినందించారు. తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్‌, ఇంటర్‌లో టాప్‌ 3లో నిలిచిన విద్యార్థులకు సన్మానం చేసి బహుమతులు అందించారు. తొలి విడుతగా జూన్‌ 28న జరిగిన ఈ కార్యక్రమంలో 750 మంది విద్యార్థులతో పాటు 3500 మంది తల్లిదండ్రులు వారి సన్నిహితులు పాల్గొన్నారు. చెన్నైలోని తిరువాన్మియూర్‌లో  ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Question Paper Leaks: ఐదేళ్లలో దాదాపు 65 ప్రశ్నపత్రాల లీకులు... యూపీ, బీహార్‌లో అత్యధికంగా..

తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్‌ ప్రతి విద్యార్థికి శాలువా, సర్టిఫికెట్‌తోపాటు రూ.5000 ప్రోత్సాహకం అందించి అభినందించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ శాఖాహార విందును ఏర్పాటు చేశారు. వేడుకల్లో పాల్గొనేందుకు 21 జిల్లాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి, తమిళనాడు వెట్రి కజగం పూర్తి ఖర్చు భరించింది. వారిని తిరిగి తమ ఇంటికి చేర్చే వరకు విజయ్‌ అన్నీ ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి విజయ్‌ ఇలా మాట్లాడారు. 'ఇటీవలి పది, పన్నెండవ  పరీక్షలలో విజయం సాధించిన నా తమ్ముళ్లు, సోదరీమణులు వారితో వచ్చిన తల్లిదండ్రులకు నా వినయపూర్వకమైన నమస్కారాలు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన కోర్సులో చేరండి. అనుకున్నది సాధించే వరకు పోరాడండి.

NTA Releases New Exam Schedule: యూజీసీ నెట్‌ కొత్త పరీక్షా తేదీలను విడుదల చేసిన ఎన్టీఏ..

సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వార్తాపత్రికలు చదవండి. డ్రగ్స్‌ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. భవిష్యత్‌లో రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయంగా క్రియాశీలకంగా మారాలి.' అని విద్యార్థులను విజయ్‌ ప్రోత్సహించారు. గతేడాది కూడా విజయ్‌ ఇలాంటి కార్యక్రమమే జరిపించారనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పోటీ చేయనున్నారు.
 

#Tags