Skip to main content

AP College of Journalism: జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు.. ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు

హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిజం కోర్సుల్లో 2024–25 సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు జరుగుతున్నాయి.
Admissions in Journalism courses    Admissions Announcemen    2024-25 Admissions  AP College of Journalism, Hyderabad

కోర్సుల వివరాలు
పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం (పిజిడిజె): ఈ కోర్సు కాల వ్యవధి 12 నెలలు. ఇందులో ప్రవేశం పొందేందుకు కనీస విద్యార్హత డిగ్రీ.  
డిప్లొమా ఇన్‌ జర్నలిజం (డిజె): ఈ కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. ఇందులో ప్రవేశం పొందేందుకు కనీస విద్యార్హత డిగ్రీ.  
డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం (డిటివిజె): ఈ కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. ఇందులో ప్రవేశం పొందేందుకు కనీస విద్యార్హత డిగ్రీ. 
సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం(సిజె): ఈ కోర్సు కాల వ్యవధి 3 నెలలు. ఇందులో ప్రవేశం పొందేందుకు కనీస విద్యార్హత పదో తరగతి.
ఈ కోర్సులను రెగ్యులర్‌గాను, దూర విద్య విధానంలోనూ చేయొచ్చు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి దగ్గర నుంచే పాఠ్యాంశాలను లైవ్‌లో వినవచ్చు. తెలుగు లేదా ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.

ముఖ్య సమాచారం
ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారం పొందటానికి చివరి తేది: 2024 ఫిబ్రవరి 29
అడ్మిషన్లు పొందటానికి చివరి తేది: 2024 మార్చి 5
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://apcj.in/

చదవండి: APSET Notification 2024: ఏపీ సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

Published date : 21 Feb 2024 10:57AM

Photo Stories