Admission in RIMC: ఏపీపీఎస్సీ-ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 01.01. 2025 తేదీ నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: 01.01.2025 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి.
పరీక్ష విధానం: రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి.. మ్యాథమేటిక్స్(200 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్(125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వాయిస్(50 మార్కులు) నిర్వహిస్తారు. రాతపరీక్ష, వైవా వాయిస్ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆర్‌ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి అసిస్టెంట్ సెక్రటరీ (ఎగ్జామ్స్), ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్స్ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.04.2024.
పరీక్ష తేది: 01.06.2024.
వెబ్‌సైట్: https://rimc.gov.in/
చదవండి: Admissions in AP Model Schools: ఏపీ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు