Skip to main content

Degree Results: డిగ్రీ ఫలితాలు విడుదల

degree results 2023 in sri krishnadevaraya university

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఐదో సెమిస్టర్‌ ఫలితాలను వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి సోమవారం విడుదల చేశారు. మొత్తం 7,203 మంది పరీక్షలు రాయగా, 4,739 మంది ఉత్తీర్ణులయ్యారు. బీఏలో 1,101 మందికి గాను 790 మంది, బీకాంలో 5,174 మందికి గాను 3,259 మంది, బీబీఏలో 928 మందికి గాను 690 మంది పాసయ్యారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 12 తుది గడువుగా నిర్దేశించారు. ప్రతి పేపర్‌కూ రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఎంవీ లక్ష్మయ్య, సీఈ కె.శ్రీరాములు నాయక్‌, అడిషనల్‌ కంట్రోలర్స్‌ వి.శైలజ, అనూరాధ, పీఆర్వో రామ్‌గోపాల్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ చెండ్రాయుడు పాల్గొన్నారు.

చదవండి: APPSC Group 1 & 2 Notification 2023 Released : నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి ఉత్తర్వులు.. మొత్తం ఎన్ని పోస్టులంటే..?

Published date : 29 Aug 2023 02:16PM

Photo Stories