Skip to main content

Results: ఫలితాల విడుదల

Degree Results
Degree Results

అనంతపురంశ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష ఫలితాలను మంగళవారం ఆ వర్సిటీ వీసీ ఆచార్య మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. మొత్తం 158 మంది ఇన్‌స్టంట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, హాజరైన 157 మంది కూడా ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.

డిగ్రీలో ఒక సబ్జెక్టు మినహా అన్ని సబ్జెక్టులూ ఉత్తీర్ణత చెందిన 5, 6వ సెమిస్టర్‌కు చెందిన విద్యార్థులకు ఇన్‌స్టంట్‌ పరీక్ష రాసే అవకాశం కల్పించినట్లు ఈ సందర్భంగా వీసీ పేర్కొన్నారు. ఈ నెల 15న పరీక్ష నిర్వహించి కేవలం 48 గంటల్లోనే ఫలితాలు విడుదల చేసిన పరీక్షల విభాగం అధికారులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ జీవీ రమణ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ శ్రీరాములు నాయక్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ చండ్రాయుడు, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

Published date : 20 Sep 2023 08:17PM

Photo Stories