ISTF World Championships–2023 : సూర్య ఆకాష్ ప్రతిభ.. యువతకు ఆదర్శం
Sakshi Education
గుంటూరు(క్రీడలు): సూర్య ఆకాష్ యువతకు ఆదర్శంగా నిలిచాడని జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల గంగాధర్, కడియం జయరావు కొనియాడారు. ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సాఫ్ట్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రపంచ చాంపియన్‌షిప్–2023 డబుల్స్ విభాగంలో రజతం పతకం సాధించిన విషయం విదితమే.
సూర్య ఆకాష్‌ను సత్కరిస్తున్న అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు
మంగళవారం స్థానిక చంద్రమౌళీ నగర్‌లోని నాధ్‌వెల్‌నెస్ సెంటర్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఒడిశాకు చెందిన అన్షుమన్‌తో కలసి సూర్య ఆకాష్ ఫైనల్స్ వరకు వెళ్లాడన్నారు. ఒక పక్క విద్యనభ్యసిస్తూ ఉన్నత ఆశయంతో కఠోర శ్రమతో అద్భుత విజయం సాధించినట్లు వివరించారు. అక్టోబర్‌లో చైనాలో జరగనున్న కామన్‌వెల్త్ క్రీడలకు ఎంపికయ్యే అవకాశాలను మెరుగుపరుచుకున్నాడన్నారు. అనంతరం సూర్య ఆకాష్‌తోపాటు తల్లిదండ్రులు తోకల సుబ్బారావు, గాయత్రిలను బత్తుల గంగాధర్, కడియం జయరావు, కోచ్ జీవిఎస్ ప్రసాద్, అరుణ్, నూతలపాటి గోపీనాథ్‌లు ఘనంగా సత్కరించారు.