Skip to main content

విద్యారంగ సమస్యలు పరిష్కరించండి

యాలాల: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించి విద్యాభివృద్ధికి సహకరించాలని టీపీయూఎస్‌ రాష్ట్ర కోశాధికారి కరణం లక్ష్మీకాంతరావు డిమాండ్‌ చేశారు.
solveeducationalproblems
solveeducationalproblems

మంగళవారం యాలాల డిప్యూటీ తహసీల్దార్‌ లక్ష్మణ్‌కు సంఘం తరఫున వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పన్నెండేళ్లుగా పదోన్నతులు, ఐదేళ్లుగా బదిలీలు లేక ఉపాధ్యాయులు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా పాలకులు దృష్టి సారించాలన్నారు. టీపీయూఎస్‌ మండల అధ్యక్షుడు గాజుల వీరేశం మాట్లాడుతూ.. మన ఊరు–మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు అందించిన విలువైన పరికరాలకు భద్రత కల్పించేలా చూడాలన్నారు. పాఠశాలల్లో వాచ్‌మెన్లు, స్కావెంజర్లను నియమించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రెండో పీఆర్సీ కమిటీని నియమించి ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో జిల్లా మీడియా కన్వీనర్‌ బస్వరాజ్‌, నియోజకవర్గ కన్వీనర్‌ శ్రీశైలం, మండల కోశాధికారి చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు సుజాత, నరేష్‌, భరత్‌, శ్రీనివాస్‌, సిద్రామేశ్వర్‌, అనసూయ తదితరులు ఉన్నారు.

Published date : 26 Jul 2023 03:02PM

Photo Stories