విదేశీ విద్యతో సామాజిక మార్పు
విదేశాల్లో చదువుకోవడం వల్ల సామాజిక మార్పుకు అవకాశం కలుగుతుందన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద విదేశాల్లో విద్యాభ్యా సం చేస్తున్న విద్యార్థుల ఖాతాలకు గురువారం బటన్ నొక్కి ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు జమ చేశారు. కార్యక్రమాన్ని జిల్లా నుంచి కలెక్టర్ నాగలక్ష్మి, డీసీఎంఎస్ చైర్‌పర్సన్ డాక్టర్ అవనాపు భావన, డిప్యూటీ మేయర్లు శ్రావణి, లయ యాదవ్, డీబీసీడబ్ల్యూ యశోధనరావు తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ దగ్గర నుంచి విదేశాల్లో విద్య నందించడం వరకు పేద కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం అండగా నిలు స్తోందన్నారు. రూ.8 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులందరూ విద్యాపథకాలకు అర్హులని పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యున్నత యూనివర్సిటీల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకు రూ.కోటి వరకు ప్రభుత్వం విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సాయం చేస్తోందని వెల్లడించారు. జిల్లాలోని ఐదుగురు బీసీ విద్యార్థులకు, ఒక ఈబీసీ విద్యార్థి ఖాతాలకు రూ.70,53,477ను ముఖ్యమంత్రి జమచేశారన్నారు. అనంతరం మోగా చెక్కును విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు.