Skip to main content

ఉన్నత విద్యకు బాసటగా..

 For higher education..
For higher education..

● విదేశీ విద్యాదీవెన రెండో విడత నిధుల విడుదల

● జిల్లాలో 12 మందికి రూ.1,37 కోట్ల లబ్ధి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జగనన్న విదేశీ విద్యాదీవెన కింద జిల్లాలో 12 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రెండో విడతగా రూ.1,37,09,253 రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వెలగపూడిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్‌ మాధవీలత, ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, రుడా చైర్‌ పర్సన్‌ షర్మిలారెడ్డి, జేసీ తేజ్‌ భరత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లబ్ధిదారుల్లో ఇద్దరు ఎస్సీ, ఒక మైనారిటీ, ఇద్దరు బీసీ, ముగ్గురు ఈబీసీ, నలుగురు ఓసీ విద్యార్థులున్నారన్నారు. వారు కోర్సు పూర్తి చేసుకునేలా నాలుగు వాయిదాల్లో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఇమిగ్రేషన్‌ కార్డు (ఐ–94) పొందాక తొలి వాయిదా, మొదటి సెమిస్టర్‌ ఫలితాల తర్వాత రెండో వాయిదా, రెండో సెమిస్టర్‌ ఫలితాల తర్వాత మూడో వాయిదా, విజయవంతంగా 4వ సెమిస్టర్‌ పూర్తి చేసి మార్కులు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాక చివరి వాయిదా చెల్లింపు జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన విద్యార్థుల్లో ముగ్గురు యూఎస్‌ఏలో, ఏడుగురు యూకేలో, ఒకరు కెనడాలో, ఒకరు కజికిస్తాన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఎంపీ భరత్‌ రామ్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లను ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి వారి తల్లుల ఖాతాలకు జమ చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు పూర్తి ఆర్థిక సాయంగా రూ.1.25 కోట్ల వరకూ, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకూ అందిస్తున్నారన్నారు. రుడా చైర్‌ పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ ఉన్నత విద్యను 50 దేశాల్లో 21 కోర్సులను చదువుకునే అవకాశాన్ని జగన్‌ ప్రభుత్వం కల్పించిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ సిటీ కో ఆర్డినేటర్‌ గూడూరి శ్రీనివాస్‌, డీఎస్‌డబ్య్లూఓ సందీప్‌, డీబీసీడబ్ల్యూఓ పీఎస్‌ రమేష్‌, ఏబీసీడబ్ల్యూఓ పి.రామకృష్ణ, ఎం.సుబ్బారావు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

కోరిక నెరవేరింది

జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా మా అబ్బాయి నంబూరి శ్రీవర్మకు గతంలో రూ.9.25 లక్షలు వచ్చింది. ఇప్పుడు రెండో విడత మంజూరైంది. విదేశాల్లో చదువు కోవాలనే మా అబ్బాయి కలను సీఎం జగన్‌ సాయంతో నెరవేరింది. ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. చదువును ప్రోత్సహిస్తున్న ఆయనకు ధన్యవాదాలు.

– నంబూరి సత్యనారాయణరాజు, వాణీ ఈశ్వరి

సీఎ జగన్‌కు కృతజ్ఞతలు

జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా మా అబ్బాయి హర్షిత్‌ శ్రీవాత్సవ విదేశాల్లో చదువుకుంటున్నాడు. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు సాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు. విదేశాల్లో ఉన్నత చదువుల కలను తీర్చుతున్న ఆయనకు రుణపడి ఉంటాం.

– పోలిన వెంకట సత్యనారాయణ, స్వరూప

రూ.34 లక్షల లబ్ధి

నేను యూకేలో ఉన్నత విద్యను అ భ్యసిస్తున్నాను. మాది మధ్య తరగ తి కుటుంబం, అమ్మ గంగా రత్నం, నాన్న ఫణిరాజు శ్రీను. జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా నాకు సుమారు రూ. 34 లక్షలు లబ్ధి చేకూరింది. సెలవలు కావడంతో స్వస్థలానికి వచ్చాను. పేద వి ద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కృషి చేస్తున్న సీఎ జగన్‌కు కృతజ్ఞతలు.

– కొండేటి సత్యసూర్య హేమంత్‌, రాజమహేంద్రవరం

Published date : 28 Jul 2023 04:12PM

Photo Stories