Provisional Merit List: ఈ వెబ్‌సైట్ లో అభ్యర్థుల జాబితా
Sakshi Education
ప్రొవిజినల్ మెరిట్ జాబితాను ఈ వెబ్‌సైటుల్లో పొందవచ్చని డీఎంహెచ్ఓ తెలిపారు. ఈ మెరకు వెబ్‌సైట్ వివరాలను కూడా వెల్లడించారు..
NRHM Provisional list of the candidates
సాక్షి ఎడ్యుకేషన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ పరిధిలో కొద్ది రోజుల కిందట వెలువడిన నోటిఫికేషన్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరిచినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహ నాయక్ తెలిపారు.
తమ పేర్లు పరిశీలించుకునేందుకు ఈస్ట్గోదావరి.ఏపీ.జీవోవీ.ఇన్, కాకినాడ.ఏపీ.జీవోవీ.ఇన్, కోనసీమ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్లను సందర్శించాలన్నారు. అభ్యంతరాలు ఉంటే శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు కాకినాడలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అధికారులను సంప్రదించి తమ అభ్యంతరాలను సమర్పించాలని కోరారు.