Skip to main content

Medical college: భువనగిరిలోనే మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలి

Medical college
Medical college

భువనగిరి : జిల్లాకు మంజూరైన మెడికల్‌ కళాశాలను యాదగరిగుట్టలో కాకుండా భువనగిరిలో ఏర్పాటు చేయాలని భువనగిరి డెవలప్‌మెంట్‌ ఫోరం(బీడీఎఫ్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఫోరం ఆధ్వర్యంలో భువనగిరిలోని రైతుబజార్‌లో నిరసన వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు భువనగిరిలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, పైగా జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడే ఏర్పాటు చేయాలని కోరారు.

వారికి ఎస్‌ఎస్‌ఆర్‌ ఓకేషనల్‌ కళాశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీడీఎఫ్‌ నాయకులు మెరుగు మధు, పూస శ్రీనివాస్‌, ఇమ్రాన్‌, ఆతహార్‌, దేవరకొండ నర్సింహాచారి, మాటూరి అశోక్‌, శోభన్‌బాబు, భాస్కర్‌, మల్లేష్‌, బాలేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 05 Oct 2023 07:57PM

Photo Stories