Skip to main content

Virgin Orbit to lay off: ఉద్యోగుల‌కు మ‌రో కంపెనీ షాక్‌... 85 శాతం మందిని సాగ‌నంపేదుకు సిద్ధ‌మైన వ‌ర్జిన్ ఆర్బిట్‌

కోవిడ్ అనంత‌ర ప‌రిణామాలు ఇప్పుడ‌ప్పుడే తొల‌గిపోయే అవ‌కాశం లేన‌ట్లు తెలుస్తోంది. ఖ‌ర్చుల‌ను తొల‌గించుకుంటున్నామ‌నే నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు సాఫ్ట్ వేర్ కంపెనీలు మాత్ర‌మే త‌మ సిబ్బందిని తొలిగిస్తూ వెళుతున్నాయి. ఇప్పుడు ఈ వ‌రుస‌లోకి అన్ని కంపెనీలు వ‌చ్చి చేరేలా క‌నిపిస్తున్నాయి. తాజాగా రాకెట్లను తయారు చేసే వ‌ర్జిన్ ఆర్బిట్ అనే కంపెనీ త‌న మొత్తం సిబ్బందిలో 85 శాతం మందిని తొల‌గిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆ వివ‌రాలేంటో చూద్దాం.
Virgin Orbit
Virgin Orbit

చ‌ద‌వండి: IT Crisis: ఉద్యోగుల తొల‌గింత‌తో పాటు బోన‌స్‌లోనూ తీవ్ర కోత‌లు...

ఫెయిల్ అవ్వ‌డంతో చుట్టుముట్టిన కష్టాలు...
అమెరికాలోని కాలిఫోర్నియాలో రిచర్డ్‌ బ్రాస్నన్‌కు చెందిన రాకెట్‌ కంపెనీ వర్జిన్‌ ఆర్బిట్‌ ఉప‌గ్ర‌హాల‌ను కక్ష్య‌లోకి పంపే రాకెట్ల‌ను త‌యారు చేస్తుంటుంది. అంత‌రిక్ష ప్ర‌యోగాలు చేప‌డుతుంటుంది. అంత‌రిక్షంలోకి మాన‌వుల‌ను పంపే కార్య‌క్ర‌మాలను ఇప్ప‌టికే స్పేస్ ఎక్స్ విజ‌య‌వంతంగా చేప‌ట్టింది. ఇలాంటి స‌మ‌యంలో అంత‌రిక్ష ప్ర‌యోగ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్మించే కంపెనీ పూర్తిగా న‌ష్టాల్లోకి కూరుకుపోవ‌డం ఆందోళ‌న‌ప‌రుస్తోంది. 2017లో ప్రారంభించ‌న త‌ర్వాత మొద‌ట ఉత్సాహ‌వంతంగా ప్ర‌యోగాలు చేప‌ట్టిన ఈ సంస్థ... ఈ ఏడాది జ‌న‌వ‌రిలో బ్రిట‌న్‌ నుంచి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో విఫలమవ‌డంతో కష్టాలు ప్రారంభ‌మయ్యాయి.

చ‌ద‌వండి: ఆటంబాంబు పేల్చిన గూగుల్‌.. భారీగా తొలగింపులు
675 మందిని తొల‌గింపు.... 
ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం బాధ‌క‌ర‌మైన విష‌య‌మైన‌ప్ప‌టికీ, మాకు వేరే మార్గం లేక‌పోవ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాన్ హార్ట్ పేర్కొన్నారు. ఉద్యోగుల తొల‌గింపుపై ఇప్ప‌టికే యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సంస్థ సమాచారం అందించింది. నిధులు స‌మ‌కూర్చుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వ‌డంతో తన సిబ్బందిలో 85 శాతం(675)మందిని    బయటకు పంపేందుకు సిద్ధ‌మైంది. దీంతో ఉద్యోగులు కోల్పోయిన వారు మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నారు.

Published date : 01 Apr 2023 01:41PM

Photo Stories