IT Crisis: ఉద్యోగుల తొలగింతతో పాటు బోనస్‌లోనూ తీవ్ర కోతలు... హడళెత్తిపోతున్న ఉద్యోగులు
చదవండి: ఆటంబాంబు పేల్చిన గూగుల్.. భారీగా తొలగింపులు
ఉద్యోగుల తొలగింపు బాక్సింగ్ గేమ్‌లా కనిపిస్తున్నట్లుంది మార్క్ జుకర్‌బర్గ్‌కు. మొదటి రౌండ్‌లో 11 వేల మంది(గత నవంబర్‌లో)ని ఇప్పటికే తొలగించింది. మరో 10 వేలమంది కొద్ది నెలలల్లో మాజీ ఉద్యోగులు కానున్నారు. కోవిడ్ తదనంతర కాలంలో సంస్థకు వచ్చే ఆదాయం క్షీణించడంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మెటా చెబుతోంది. ఇందులో భాగంగానే కాస్ట్ కటింగ్ భారీగా చేపడుతోంది.
చదవండి: 11 వేలమందికి మైక్రోసాఫ్ట్ టాటా
3 బిలియన్ డాలర్ల మేర ఆదా...
మెరుగైన పనితీరు కనబర్చిన ఉద్యోగులకు ప్రోత్సాహకంగా కంపెనీలు భారీగా బోనస్ ఇస్తుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం బోనస్ లో కూడా భారీగా కోత విధించనున్నట్లు మెటా వర్గాలు చెబుతున్నాయి. ఐదు రేటింగ్స్‌లో గరిష్ట రేటింగ్ వచ్చిన వారికి సైతం ప్రతీ ఏడాది ఇచ్చే బోనస్‌లో 65 శాతం నుంచి 85 శాతం మేర కోత విధిస్తున్నట్లు మేనేజర్లకు పంపిన అంతర్గత మెమోలో మెటా పేర్కొంది. అలాగే గతేడాది ఆర్థిక అంచనాలలో భాగంగా 5 వేల మందిని తీసుకోవాలని మెటా నిర్ణయించింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో వీరి నియామకం పూర్తిగా ఆపేయనున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఖర్చుల తగ్గింపుతో పాటు, ఉద్యోగుల తొలగింపుతో మెటాపై దాదాపు 3 బిలియన్ డాలర్ల మేర ఆదాకానుంది.