Skip to main content

UPSC Exam Dates: UPSC పరీక్షలు ఎప్పుడంటే..

UPSC Exams,UPSC Exam Planning,UPSC Examination Preparation
UPSC Exams

యూపీఎస్సీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో యూపీఎస్సీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ ఈ నెల 4, 5 తేదీల్లో రెండు షిఫ్టుల్లో యూపీఎస్సీకి సంబంధించి కంబైన్డ్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఈ పరీక్షకు జిల్లాలో 926 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు, రూట్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు యూపీఎస్సీ గైడ్‌ లైన్స్‌ తప్పకుండా పాటించాలన్నారు.

అభ్యర్థులు హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. విద్యార్థులు పరీక్ష సమయం కంటే అరగంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఆర్టీసీ, పోలీస్‌, వైద్య, విద్యుత్‌ తదితర విభాగాల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో పరీక్షల విభాగం సూపరింటెండెంట్‌ పాల్‌ కిరణ్‌, విద్యుత్‌, ఆర్టీసీ, జీవీఎంసీ, పోలీస్‌, రెవెన్యూ, పోస్టల్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Published date : 03 Nov 2023 07:50AM

Photo Stories