Skip to main content

Anganwadi Teachers and Workers jobs: అంగన్‌వాడీలో భారీగా టీచర్లు, ఆయాల ఉద్యోగాలు

Anganwadi Teachers jobs
Anganwadi Teachers jobs

భువనగిరి : అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి మోక్షం లభించింది. ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. చిన్నారులకు పూర్వ, ప్రాథమిక విద్య, ఆరోగ్య రక్షణతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది.

Gurukula jobs: గురుకుల కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు: Click Here

901 కేంద్రాలు

భువనగిరి, రామన్నపేట, ఆలేరు, మోత్కూర్‌లో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 901 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో చిన్నారులు 36,084, గర్భిణులు 5,024, బాలింతలు 4,392 మంది ఉన్నారు.

ఖాళీలు ఇలా..

నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పఽరిధిలో 328 ఖాళీలున్నాయి. వీటిలో టీచర్లు 64, ఆయా పోస్టులు 243 ఉన్నాయి. వీటితో పాటు విధి నిర్వహణలో ఉండి మృతిచెందిన వారు, రాజీనామా చేసినవారు, టీచర్లు సూపర్‌వైజర్లుగా పదోన్నతి పొందడంతో ఖాళీలు ఏర్పడ్డాయి.

త్వరలోనే భర్తీ చేస్తాం

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలను గుర్తించాం. ఇందుకు సంబంధించిన నివేదకను ఉన్నతాధికారులకు అందజేస్తాం. ఉన్నతస్థాయి మార్గదర్శకాల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తాం. త్వరలోనే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఖాళీలను భర్తీ చేయడం ద్వారా లబ్ధిదారులకు సేవలు మరింత మెరుగుపడనున్నాయి.

Published date : 21 Aug 2024 01:51PM

Photo Stories