Fashion Designing and beautician Courses: 1500 రూపాయలతో మూడు నెలల పాటు ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ

మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 16వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ జనవరి 23న ఓ ప్రకటనలో తెలిపారు.
10వ తరగతి ఇంటర్ అర్హతలతో ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్ ఉద్యోగాలు జీతం నెలకు 69,100: Click Here
పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన యువతకు మూడు నెలల పాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ తయారీ, బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ ఇస్తామని వివరించారు. ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.
దరఖాస్తు వెంట విద్యార్హత, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో జత చేయాలని కోరారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు సెంటర్ ఇన్‌చార్జి ఎస్.విజయ్‌కుమార్ (94415 65895)ను సంప్రదించాలని సూచించారు.
Tags
- Skill development for unemployed youth
- Training for self employment opportunities
- Fashion Designing and beautician Courses Training
- Self Employment Courses
- women self employment courses
- Free Self Employment Courses
- Fashion Designing Courses
- beautician and fashion designing courses
- women success in fashion designing
- Fashion Designing
- Careers Fashion Designing
- Free training in beautician and fashion designing courses
- beautician course
- women in beautician course
- beautician courses
- Beautician courses announcement
- three Months Fashion Designing and beautician Courses Training for 1500 Hundred rupees Fee
- MS Office
- MS Office Skills
- Air Conditioner Free Course
- Mobile Servicing
- Setwin Training Center
- Electrician Course
- Free Skill Training
- Skill Training
- Skill training courses
- Youth Skill Training
- 3 months Coaching
- Mahabubnagar District News
- 1500 Hundred rupees Fee
- Good news for unemployed
- Good news for unemployed youth
- Mahabubnagar self employment training