RTC Workers Felicitation: ఆర్టీసీ ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు
Sakshi Education
ఆర్టీసీలో విధులు వరించే వారికి ఉత్తమ అవార్డుతో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారిని సన్మానించి, వారికి ప్రోత్సాహం అందించారు..
Workers of RTC gets felicitated by officers as best workers
సాక్షి ఎడ్యుకేషన్: మధిర ఆర్టీసీ డిపోలో విధులు నిర్వర్తిస్తూ వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మంగళవారం అవార్డులు అందజేశారు. డిపో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ ఉద్యోగులను సన్మానించి మాట్లాడారు.
అనంతరం డిపోలో అన్ని విభాగాలను తనిఖీ చేసి మాట్లాడుతూ ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఖమ్మం రీజినల్ మేనేజర్ వెంకన్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు పవిత్ర, భవానీప్రసాద్, డిపో మేనేజర్ దేవదానం పాల్గొన్నారు.