Skip to main content

Pharma Company Job Fair: హెటిరో ఫార్మాకంపెనీ జాబ్‌ మేళా

Pharma Company Job Fair
Pharma Company Job Fair

పార్వతీపురంటౌన్‌: ఈనెల 30వ తేదీన స్థానిక భాస్కర్‌ డిగ్రీ కళాశాలలో హెటిరో ఫార్మాకంపెనీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్‌ బొంతు శ్రీనివాసరావు తెలియజేశారు. ఐటీఐ(ఫిట్టర్‌), డిప్లమో (మెకానిక్‌), బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎంఎస్సీ(కెమిస్ట్రీ), బీకాం(కంప్యూటర్స్‌) ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్‌మేళాకు అర్హులన్నారు. 27 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు జాబ్‌మేళాకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 8019719234, 8074231274 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

Published date : 27 Oct 2023 08:23PM

Photo Stories