ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
Sakshi Education
నల్లగొండ టూటౌన్ : మూడు సంవత్సరాలకు పైబడి పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా బాధ్యుడు లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని టీఎన్‌జీఓ భవన్‌లో జరిగిన జేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఏజన్సీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు సంతోష్, జె.వినోద్, కృష్ణ, గోవర్ధన్, రాము తదితరులు పాల్గొన్నారు.
Published date : 07 Aug 2023 03:32PM