Mega Job Mela: 30న మెగా జాబ్ మేళా.. ఎంపికైన అభ్యర్థులకు కనీస వేతనం రూ.25,000 వరకు వేతనం..
ఈ మెగా జాబ్‌మేళాలో జోయాలుకాస్, హెటెరో డ్రగ్స్, వైఎస్‌కే ఇన్ఫోటెక్, ఆల్‌సెట్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్, ఎస్బీ కార్డ్స్, అమరరాజా బ్యాటరీస్, టాటా ఎలక్ట్రానిక్స్, లయం గ్రూప్ జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ, డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ జియో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫోకం, డి మార్ట్, ఎస్వీ ఫుడ్స్ ప్రై.లి తదితర 15 బహుళజాతి కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌తోపాటుగా ఏదైనా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఇంటర్వ్యూలో ఎంపికై న అభ్యర్థులకు కనీస వేతనం రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. స్కిల్ యూనివర్స్ వెబ్‌సైట్‌లో కానీ, మొబైల్ యాప్ ద్వారా కానీ తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9988853335కు ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరారు.
Tags
- Mega Job Mela
- Mega Job Mela on 30th
- mega job fair 2023
- apssdc
- APSSDC Mega Job Fair
- Govt Junior Colleges
- Tata Electronics
- Jobs
- Mega Job Mela in Andhra Pradesh
- Andhra Pradesh Jobs
- Education News
- Job Fair
- Career Opportunities
- Andhra Pradesh
- Skill Development
- Employment
- district level
- Collaboration
- educational institutions
- Community development
- Networking
- Skills enhancement
- Event announcement
- latest jobs in 2023
- sakshi education job notifications