Skip to main content

Mega Job Mela: డిసెంబర్‌ 2న మెగా జాబ్‌ మేళా

Mega Job Mela

రాయచోటిటౌన్‌: డిసెంబర్‌ 2వ తేదిన రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో రాయలసీమ జోన్‌ మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌ సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. నవంబర్ 16 గురువారం రాయచోటి జిల్లా పరిషత్‌ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాషా, స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ అధికారులతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాయచోటి ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు లేవని కేవలం విద్య ద్వారానే ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళుతున్నారన్నారు. ఈ క్రమంలో డిసెంబర్‌ 2వ తేదిన శ్రీ సాయి ఇంజనీరింగ్‌ కళాశాలలో పది వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా రీజనల్‌ స్థాయి మెగా జాబ్‌ మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ పీజీ, టెక్నికల్‌ కోర్సులు, పాలిటెక్నికల్‌, నర్సింగ్‌, ఫార్మసీ. ఒకేషనల్‌ కోర్సులు చదివిన అభ్యర్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సుండుపల్లె రహదారిలో ఏపీఐఐసీకి 600 ఎకరాలు మరో ప్రాంతంలో పీజీ కళాశాలకు 60 ఎకరాలు యునానీ కళాశాలకు 10 ఎకరాల భూమిని సేకరించి ముందు చూపుతో ఉన్నామన్నారు. జాబ్‌ మేళలో ఎంపిక చేసిన తరువాత అక్కడే నియమకం పత్రాలు కూడా ఇస్తారని తెలిపారు. వివిధ స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ50 వేల వరకు జీతాలు పొందే అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్కిల్‌ డెవలెప్‌ మెంట్‌ రీజనల్‌ మేనేజర్‌ శ్యాంమోహన్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ, మున్సిపల్‌ కమీషనర్‌ గంగా ప్రసాద్‌, ఎంపీడీవో మల్‌రెడ్డి, నరిసింహులు, దివ్య, ఇన్‌చార్జీలు పట్నాయక్‌, జాబీర్‌ అహమ్మద్‌, శ్రీ సాయి ఇంజనీరింగ్‌ కళాశాల ప్లేస్‌మెంట్‌ అధికారి ఇంతియాజ్‌, మండల బీసీ నాయకులు పల్లపు రమేష్‌, ఫయాజ్‌ అహమ్మద్‌, జానం రవీంద్ర యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Free Coaching : ఉచిత సివిల్స్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోండి

Published date : 17 Nov 2023 03:18PM

Photo Stories