Sakhi Stop Center: సఖీ–1 స్టాఫ్ సెంటర్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
నంద్యాల(అర్బన్): సఖీ–1 స్టాఫ్ సెంటర్ (మిషన్ శక్తి–సింబల్)లో ఖాళీ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి నిర్మల మార్చి 11వ తేదీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఖాళీల భర్తీకి ఈనెల 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి సంబంధిత సెంటర్ అడ్మినిస్ట్రేషన్ కేసు వర్కర్, పారా లీగల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్ తదితర పోస్టులకు అర్హత పరీక్షలు నిర్వహించామన్నారు. కాగా అభ్యర్థులెవరూ అర్హత సాధించకపోవడంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ అభ్యర్థుల నుంచి కొత్తగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. నోటి ఫికేషన్, వయస్సు, విద్యార్హత వివరాలకు జిల్లా వెబ్‌సైట్ https://nandyal.ap.gov.in పరిశీలించాలన్నారు.
DSC SGT Free Coaching: డీఎస్సీ, ఎస్జీటీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Published date : 13 Mar 2024 12:09PM