Skip to main content

Job Mela: రేపు ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌ మేళా

విజయనగరం అర్బన్‌: వివిధ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈనెల 3న పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.అరుణ ఒక ప్రకటనలో గురువారం తెలిపారు.
Opportunity alert   District Employment Office hosts job fair to connect candidates with companies   Job fair tomorrow at Govt ITI   Job fair at ITI town on 3rd to fill vacancies in multiple companies

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఇంటెల్‌ సర్వ్‌ ఐటీ సొల్యూషన్స్‌ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుందని పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌–6, ఫైనాన్షియల్‌ కల్సల్టెంట్‌–50, ఇంటెల్‌ సర్వ్‌లో ఫీల్డ్‌ కలెక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆఫీస్‌ వర్క్‌–25 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆయా పోస్టులను బడ్టి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌, డిప్లమో, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. విజయనగరం, తగరపువలస, ఎస్‌.కోట ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను ముందుగా ‘ఎన్‌సీఎస్‌.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లోని జాబ్‌ సీకర్స్‌ లాగిన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు స్థానిక బీసీ కాలనీలోని ప్రభుత్వ ఐటీఐలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఫోన్‌ 8919378915 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

చదవండి: Job Mela: యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

Published date : 03 Feb 2024 08:08AM

Photo Stories