Job Mela: యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
Sakshi Education
కర్నూలు సిటీ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు.
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని సెయింట్ జోసెప్ డిగ్రీ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మేయర్, ఎమ్మెల్యే ప్రసంగించారు. ఉద్యోగాలు పొందేలా డిగ్రీ కోర్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో తీసుకొచ్చిన మార్పులను చూసి వివిధ రాష్ట్రాలకు చెందిన అభినందనలు చెబుతున్నారన్నారు. జాబ్ మేళాలో సుమారుగా 1,500 మంది నిరుద్యోగులు పాల్గొనగా, ఆయా కంపెనీలు వారికి కావాల్సిన విద్యార్హతలు కలిగిన వారిని ఎంపిక చేసుకున్నారు. ఈ మేళాలో జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.
చదవండి: AP Medical Services Recruitment Board: వైద్యశాఖలో 253 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Published date : 03 Feb 2024 10:15AM
Tags
- Job mela
- employment opportunities
- employment opportunities for the youth
- Employment
- Skill Development
- unemployed
- Skill Development Officers
- Job Mela in Andhra Pradesh
- Education News
- andhra pradesh news
- YSRCP government
- job opportunities
- Employment Improvement
- Kurnool City Mayor
- Sakshi Education Updates