Job Fair: యూనివర్సిటీలో జాబ్ మేళా
Sakshi Education
తిరుపతి సిటీ : ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో ఈ నెల 26వ తేదీ ఉదయం 9.30 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ టీ.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాలో భార్గవి ఆటోమోబైల్స్, ఎస్‌బీబీ మెడీకేర్, అపోలో ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 206 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పది, ఐటీఐ, ఇంటర్, డిప్లొమో, ఫార్మసీ, బీటెక్, డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వివరాలకు ఎస్వీయూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
Published date : 26 Sep 2023 09:28AM